తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ముగింపు దశకు చేరుకుంది. గత సీజన్ లో మాదిరిగానే ఈసీజన్ లో కూడా ఇంటి సభ్యులకు సంబంధించిన ఆప్తులను బిగ్ బాస్ ఇంట్లోకి పంపించడం జరిగింది. తమ వారు రావడంతో ఇంటి సభ్యులు ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.  సామ్రాట్ తల్లి బిగ్ బాస్ హౌస్‌ నుండి బయటకు వెళ్లిన తరువాత అమిత్ కొడుకు, భార్య హౌల్‌లోకి వచ్చారు. మొదటి అమిత్ కొడుకు ముద్దు ముద్దు మాటలకు ముగ్ధులయ్యారు కంటెస్టెంట్స్. హౌస్‌లోకి ఎవరొస్తారని ఎదురుచూస్తున్న సందర్భంలో దీప్తి నల్లమోతు కొడుకు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.


చానాళ్ల తరువాత కొడుకుని చూసిన దీప్తి.. తీవ్ర భావోద్వేగంతో తల్లిడిల్లిపోయింది.  ఇక టీవీ9 దీప్తి భర్త బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాడు. ఆ సమయంలో ఇంటి సభ్యులతో చాలా సమయం ఆయన మాట్లాడటం జరిగింది. అందరు కూడా బాగా ఆడుతున్నారు అంటూ చెప్పిన ఆయన దీప్తి విషయంలో తనీష్ వ్యవహరించిన తీరుపై కాస్త సీరియస్ అయినట్లుగా అనిపించింది. ఏం మాట్లాడారో ప్రేక్షకులకు అర్ధం కాకపోయినా.. చూసుకుని గేమ్ ఆడితే మంచిది అని తనీష్‌కి సలహా ఇచ్చారు.


ఇంట్లోంచి వెళ్తున్న సమయంలో తనీష్ ను ఉద్దేశించి ఫిజికల్ టాస్క్ లు ఆడే సమయంలో కొంచెం చూసుకోండి అంటూ వెళ్లి పోయాడు.  టికెట్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా తనీష్ మరియు దీప్తిల మద్య చోటు చేసుకున్న పరిణామం అందరికి షాకింగ్ గా అనిపించింది. దీప్తి పట్ల తనీష్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి.  దీని ప్రకారం కారు టాస్క్‌లో దీప్తి నల్లమోతుతో తనీష్‌ ప్రవర్తించిన తీరును ఇన్ డైరెక్ట్‌గా ప్రస్తావించారు దీప్తి భర్త.  కొన్నిసార్లు  దీప్తిని పలు సార్లు నామినేట్ చేయడంతో పాటు టాస్క్ ల్లో దీప్తిని తనీష్ టార్గెట్ చేయడం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. అందుకే ఆయన విషయంలో దీప్తి భర్త కాస్త సీరియస్ గానే స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: