‘కుమారి 21 ఎఫ్’  సూపర్ సక్సస్ తరువాత యూత్ లో రాజ్ తరుణ్ కు ఏర్పడ్డ ఫాలోయింగ్ ని చూసి రాజ్ తరుణ్ టాప్ యంగ్ హీరోల రేసులోకి చేరిపోతాడు అని భావించారు అంతా. అయితే అనూహ్యంగా ఆతర్వాత ఆస్థాయి అందుకోలేదు సరికదా మినిమమ్ గ్యారెంటీ హీరో స్థాయి నుంచి కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేని హీరో స్టేజ్ కి రాజ్ తరుణ్ పడిపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 
Raj Tarun Interview: Rangula Ratnam Is a perfect film for Sankranthi
ఈఏడాది రాజ్ తరుణ్ మూడు సినిమాలు చేస్తే అన్ని డిజాస్టర్ కు చేరువగా మారడం అతడి కెరియర్ కు శాపంగా మారింది. అన్నపూర్ణ లాంటి పెద్ద బ్యానర్ తో ‘రంగుల రాట్నం’ చేస్తే అది వచ్చిన సంగతి టీవీలో చూసేదాకా ప్రేక్షకులకు గుర్తుకు రాలేదు అంటే ఈ హీరో రేంజ్ ఏవిదంగా పడిపోయిందో  అర్ధం అవుతుంది. ఇక ఆతర్వాత వచ్చిన ‘రాజుగాడు’  దిల్ రాజు లాంటి అగ్రనిర్మాత తీసిన ‘లవర్’ సైతం అత్యంత ఘోర మైన ఫ్లాప్స్ గా మారడంతో అసలు ఈయంగ్ హీరో కెరియర్ పరంగా ఎమౌతాడు అన్న సందేహాలు క్రియేట్ చేస్తోంది. 

దీనికితోడు రాజ్ తరుణ్ తన కొత్త సినిమాల గురించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వక పోవడం మరింత షాకింగ్ గా మారింది. ఈమధ్య  లవర్ విడుదలైన కొద్దిరోజులకు ఈయంగ్ హీరో  తిరుపతి వెళ్ళి  గుండు కొట్టించుకుని వచ్చాడు. దీనితో సినిమా సక్సస్ కాకపోయినా ఈమొక్కులు ఏమిటి అంటూ కొందరు షాక్ అయ్యారు. మరికొందరు అయితే ఇది  పాత మొక్కు అయినా అయి ఉంటుంది లేదా త్వరలో ప్రారంభం కాబోతున్న అతడి లేటెస్ట్ సినిమాకు సంబంధించి విభిన్నమైన పాత్రకోసం జుట్టు లేకుండా కనిపించేందుకు ఇలా గుండు చేయించుకుని ఉంటాడు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
Raj Tarun
తెలుస్తున్న సమాచారం మేరకు రాజ్ తరుణ్  రెండేళ్ల క్రితం విడుదలైన ఒక తమిళ రీమేక్ చేయబోతున్నాడుఅని టాక్. ఈసినిమా లుక్ కోసం పూర్తిగా రెస్ట్ తీసుకుని జుత్తు మళ్ళి యధాస్థితికి వచ్చాక మాత్రమే తన కొత్త సినిమాకు రాజ్ తరుణ్ రెడీ అవుతాడు అన్నవార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సందేహాలు ఎన్నో వస్తున్న అసలు సమాధానం ఒక్క రాజ్ తరుణ్ కు మాత్రమే తెలుసు. అయితే ఈయంగ్ హీరో ఇప్పుడు ఎవరికీ కనిపించ కుండా అజ్ఞాతవాసం చేయడం సమాధానం లేని ప్రశ్నగా మారింది.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: