ఈ మద్య యువత ఎక్కువ శాతం డేటింగ్ కల్చర్ కి బాగా అలవాటు పడింది.   ఇద్దరు ప్రేమించుకొని కొంత కాలం కలిసి ఉన్న తర్వాత వారి మద్య ఎలాంటి మనస్పర్థలు వచ్చినా..విడిపోవొచ్చు..లేదంటే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న జంటలు ఉన్నాయి.  చాలా వరకు డేటింగ్ కల్చర్ లో విషాదాలే ఎక్కువగా ఉన్నాయి.  మొదట్లో వ్యామోహమో..ప్రేమో ఏదైనా కలిసి మెలిసి ఉంటారు..కొంత కాలం తర్వాత తేడాలు రావడంతో విడిపోవడం చూస్తూనే ఉన్నాం.  ఇది సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు జరుగుతున్న తంతే. తాజాగా ఓ జూనియర్ నటితో ఎఫైర్ సాగించిన తీరా పెళ్లి చేసుకునే టైమ్ కి ముఖం చాటేశాడు. 
Image result for dating
పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కృష్ణానగర్‌ బీ బ్లాక్‌లో ఉంటున్న నండూరి ఝాన్సీరాణి అలియాస్‌ మోనాలిసా సినీ నటి.  వైజాక్ కి చెందిన  చైతన్య అనే యువకుడితో పరిచయం ఏర్పడింది..ఆ పరిచయం ప్రేమగా మారి కొంత కాలం సహజీవనం చేశారు. బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని గట్టిగా అడగడంతో...ఏదో నామ మాత్రంగా దేవుడి ముందు మంగళసూత్రం కట్టాడు.

 యువతి బంధువులు మాత్రం ఇది తప్పించుకోవడానికి చేస్తున్న తంతే అని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని గట్టిగా అడిగారు...కానీ మనోడు మాత్రం నిరాకరించాడు. గత వారం రోజులుగా అతడి జాడలేకపోగా ఈ నెల13న ఇంటికి వచ్చిన చైతన్య బంధువులు ఆమెను బెదిరించారు.  చైతన్యకు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: