నిన్న వినాయకచవితి సందర్భంగా జూనియర్ అభిమానులకు జోష్ ను కలిగించాలని ‘అరవింద సమేత’ కు సంబంధించిన జూనియర్ సాఫ్ట్ లుక్ పోస్టర్ లో కొత్తదనం ఏముంది అంటూ అప్పుడే కామెంట్స్ మొదలైపోయాయి. గతంలో ఇదే మూవీకి సంబంధించి జూనియర్ యాక్షన్ ఫీల్‌ తో కూడిన యాంగ్రీ లుక్‌ విడుదలైన తరువాత ఇప్పుడు క్లాస్ ఆడియన్స్ ను టచ్ చేస్తూ ఈ సాఫ్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.  
Aravindha Sametha Teaser
అయితే ఎన్టీఆర్ సాఫ్ట్ లుక్ కు సంబంధించిన ఎటువంటి డైలాగ్స్ ను టీజర్ ద్వారా విడుదల చేయకుండా కేవలం ఒక సాఫ్ట్ లుక్ పోస్టర్ తో సరిపెట్టడం జూనియర్ అభిమానులు సంతృప్తి పరిచినా ఈలుక్ లో డిఫరెన్స్ ఏముంది అంటూ విమర్శకులు కొందరు జూనియర్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈమూవీ ఆడియో ఫంక్షన్ ఏమీ జరగకుండా కేవలం యూట్యూబ్ ద్వారా ఈనెల 20న పాటలు విడుదల కాబోతున్నాయి. 
Jr NTR,Lloyd Stevens,Aravindha Sametha
ఈమూవీ విడుదల తేదీ మరో 25 రోజులలో దగ్గర పడబోతున్నా రకరకాల కారణాలతో ఈమూవీకి సంబంధించిన ప్రమోషన్ చాల తక్కువ స్థాయిలో జరగడం జూనియర్ అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తున్నట్లు టాక్. దీనితో ఈసినిమాకు సంబంధించి ప్రస్తుతానికి ఆనంద పడవలసిన విషయాలు ఏమీ లేవు అంటూ ఏకంగా జూనియర్ అభిమానులే భారమైన నిట్టూర్పులు విడుస్తున్నట్లు టాక్. 
Aravinda Sametha photo leaked Jr NTR bonding with Naga Babu
ఇలా ఈమూవీ ప్రమోషన్ ను రకరకాల కారణాలతో గాలికి వదిలేస్తే ఎప్పటికి ‘అరవింద సమేత’ మ్యానియా ప్రేక్షకులలో ఏర్పడుతుంది అని ఏకంగా జూనియర్ అభిమానులే భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈమూవీకి సంగీత దర్శకత్వం వహించిన తమన్ క్రేజ్ బాగా తగ్గిపోయిన నేపధ్యంలో ఈనెల 20న విడుదల కాబోతున్న ఈమూవీ పాటలు యూత్ కు బాగా కనెక్ట్ కాకపోతే ‘అరవింద సమేత’ కు బాగా కష్టాలు తప్పవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: