దశాబ్ధ కాలాలుగా ఫైట్ మాస్టర్స్ గా పనిచేస్తున్న రామ్ లక్ష్మణ్ తమ కెరియర్ కు గుడ్ బై చెప్పేయాలని నిర్ణయించుకున్నారు. 1987లో ఫైట్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈ ఇద్దరు కవలలు.. తమ స్వశక్తితో ఫైట్ మాస్టర్స్ గా ఎదిగారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో 1100 సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేశారు. 


అయితే కెరియర్ ఇప్పటికి మంచి జోరుగా కొనసాగుతున్నా సొంత ఊరి కోసం వారు కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. వారు పుట్టి పెరిగిన కారం చెడు గ్రామానికి సేవ్ చేసేందుకు రాం లక్ష్మణ్ సినిమాలను పూర్తిగా వదిలేయాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు.


అంతేకాదు కొన్ని సామాజిక కార్యక్రమాలను వారు చేసేందుకు నడుం బిగించారట. చూస్తుంటే రాం లక్ష్మణ్ పొలిటికల్ గా తమ కెరియర్ కొనసాగించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సేవ చేసే గుణం అది ఎవరైనా సరే మంచిదే.. అందుకే వారి నిర్ణయానికి అందరు ఆహ్వానం పలుకుతున్నారు.


అయితే ఊరు బాగు కోసం కృషి చేయాలన్న సంకల్పం మంచిదే కాని దానికి సిని కెరియర్ ను ముగించాల్సిన అవసరం ఏముందని కొందరి వాదన. ఏది ఏమైనా ఈ విషయంపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే దాకా కన్ ఫ్యూజన్ గానే ఉంటుంది. ఫైట్ మాస్టర్ విజయన్ తర్వాత అంత గొప్ప పేరు తెచ్చుకున్న ఫైట్ మాస్టర్స్ రాం లక్ష్మణ్ అని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: