స్టార్ దర్శకులు మణిరత్నం తీసిన ‘రోజా’,‘ముంబాయి’ సినిమలతో తెలుగు, తమిల ప్రేక్షకుల మనసు దోచిన  ప్రముఖ నటుడు అరవింద స్వామి న్యాయస్థానం మెట్లు ఎక్కారు. ఓ సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన పారితోషకాన్ని నిర్మాత ఇవ్వకపోవడంతో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.  చతురంగవేట్టై చిత్రాన్ని నిర్మించిన నటుడు మనోబాలా  ఆ చిత్రం విజయం సాధించడంతో తాజాగా చతురంగవేట్టై–2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అరవిందస్వామి కథానాయకుడు గానూ, నటి త్రిష కథానాయకిగా నటించారు. 


నిర్మాణ కార్యక్రామలు పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు నిర్మాత మనోబాల సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హీరో అరవిందస్వామి ఈ చిత్రంలో నటించినందుకు పారితోషికాన్ని నిర్మాత మనోబాలా పూర్తిగా  చెల్లించకపోవడంతో అరవింద్ స్వామి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సినిమా కోసం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మనోబాలా తన క్లయింట్ కు ఇంకా రూ.1.79 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.


ఈ విషయమై ఎన్నిసార్లు సంప్రదించినా స్పందించకపోవడంతో కోర్టుకు ఆశ్రయించామన్నారు. తమకు ఇవ్వాల్సిన మొత్తాన్ని 18 శాతం వడ్డీతో చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు.  ఈ కేసు బుధవారం న్యాయమూర్తి సందర్‌ సమక్షంలో విచారణకు వచ్చింది.   నటుడు అరవిందస్వామి తరఫున హాజరైన న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి చిత్ర నిర్మాత మనోబాలకు నోటీసులు జారీచేయవలసిందిగా ఆదేశిస్తూ ఈ నెల 20వ తేదీలోగా ఆయన బదులు పిటిషన్‌ దాఖలు చేయాలని పేర్కొన్కారు. కొంత కాలంగా సినిమాకు గ్యాప్ ఇచ్చిన అరవింద్ స్వామి ‘కడలి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ప్రతినాయకుడి పాత్రల్లో నటిస్తున్నారు.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: