త్రివిక్రమ్ వెంకటేష్ ల కలయికతో నిర్మాత రాథాకృష్ణ ఒక సినిమాకుసంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించి చాలా రోజులు కావస్తోంది. అయితే ఆతరువాత త్రివిక్రమ్ అరవింద సమేత వ్యవహారాలతో బిజీ అయిపోతే విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తున్న ‘ఎఫ్ 2’ మూవీ షూటింగ్ లో బిజీ అయిపోయాడు 
venkatesh and varun tej f2 movie for sankranthi, venkatesh varun tej f2 release date, venkatesh varun tej movie release for sankranthi, venkatesh varun tej multistarrer for sankranthi, movie news, tollywood news, tollywood updates, saycinema,
అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ అంచనాల నడుమ నిర్మిస్తూ వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా విడుదల చేయబోతున్నాడు. ఈ మూవీ పూర్తి అయిన వెంటనే నాగ చైతన్యతో కలిసి వెంకటేష్ మరో మల్టీ స్టారర్ కు రెడీ అవుతున్నాడు. అయితే ఈసినిమాను చేస్తూనే ఇప్పటికే ప్రారంభించిన త్రివిక్రమ్ మూవీని కూడ పూర్తి చేయడానికి వెంకటేష్ వ్యుహాలు నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈవిషయానికి సంబంధించి ఇప్పుడు ఈప్రాజెక్ట్ వెనుక పవన్ పరోక్ష హస్తం ఉండటం హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ గతంలో పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేసుకున్న  కథను వెంకీతో సినిమా చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు టాక్. ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఈ కథ సినిమాగా రావలసి ఉందట. ఈకథ పవన్ కు కూడ నచ్చడం జరిగిందని సమాచారం కాని పవన్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో ఈకథ సినిమాగా పట్టాలెక్కలేదని ఇప్పుడు అదే కథతో వెంకీని త్రివిక్రమ్ ఒప్పించాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హడావిడి చేస్తున్నాయి. 
Is Trivikram Srinivas Quitting Films?  
గతంలో వెంకటేష్ తో ‘నువ్వునాకు నచ్చావ్’ ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలకు రచయితగా వర్క్ చేసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంటే వెంకటేష్ కు చాలా అభిమానం. ఈ అభిమానంతోనే ఈప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ చేసినట్లు టాక్. వచ్చే ఏడాది మార్చిలో ఈ మూవీ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది అని  తెలుస్తోంది . ఏమైనా పవన్ కోసం తయారు చేయబడ్డ  కధలో వెంకటేష్ కనిపించడం ఒకవిధంగా షాకింగ్ అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: