ఈ మద్య ఒక్క సినిమా నటులు,దర్శకులు, టెక్నీషియన్స్ జాతకాలు మారుస్తున్నాయి.  ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాల నుంచి రాని ఇమేజ్ కొంత మంది అదృష్టం కొలది ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ ఇమేజ్ సొంతం అవుతుంది.  ఆ మద్య తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చిన్న సినిమాగా వచ్చిన ‘పెళ్లిచూపులు’ అద్భుతమైన విజయం సాధించింది..ఈ సినిమాతో బిజీ దర్శకుడిగా మారారు తరుణ్ భాస్కర్.  అంతే కాదు ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కు మంచి పేరు వచ్చింది.  ఆ తర్వాత  సందీప్ వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు విజయ్ దేవరకొండ. 


 దాంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన చేరిపోయాడు విజయ్ దేవరకొండ. అంతే కాదు సందీప్ వంగకు కూడా స్టార్ హీరోల దగ్గర నుంచి పిలుపు వచ్చింది.  ఈ మద్య కొత్త నటులు, నిర్మాత తో రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి ‘ఆర్ ఎక్స్ 100’సినిమతో వచ్చారు..ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఉందని మొదట్లో విమర్శలు వచ్చినా..తర్వాత థియేటర్లో సినిమాపై మంచి క్రేజ్ వచ్చింది..ముఖ్యంగా యువతకు బాగా కనెక్ట్ కావడంతో కలెక్షన్ల వర్షం కురిపించింది.

కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌ హీరో హీరోయిన్లుగా అజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఎక్స్‌ 100 సంచలన విజయం సాధించడంతో ఈ దర్శకుడిపై యంగ్ హీరోల చూపు పడింది.  తాజాగా అజయ్‌ దర్శకత్వంలో నటించేందుకు ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ ఓకె చెప్పారన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో హలోగురు ప్రేమ కోసమే సినిమాలో నటిస్తున్న రామ్‌.. ఆ సినిమా తరువాత అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పారట. ఈ సినిమాను రామ్‌ సొంత నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్‌ నిర్మించనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: