గురు తర్వాత ఒకేసారి రెండు క్రేజీ మల్టీస్టారర్ సినిమాలను చేస్తున్నాడు విక్టరీ వెంకటేష్. వరుణ్ తేజ్ తో ఎఫ్-2, నాగ చైతన్యతో వెంకీ మామ సినిమాలు చేస్తున్నాడు వెంకటేష్. ఈ రెండు సినిమాల తర్వాత తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా చేసే అవకాశాలున్నాయట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.


సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. తొలిప్రేమ తర్వాత అక్కినేని అఖిల్ తో సినిమా చేస్తున్న వెంకీ అట్లూరి ఈ సినిమాను లవ్ స్టోరీ చేస్తున్నాడట. ఇదిలాఉంటే అఖిల్ సినిమా తర్వాత వెంకీ అట్లూరి విక్టరీ వెంకటేష్ తోనే సినిమా చేస్తాడని అంటున్నారు. 


ఈ సినిమా డిఫరెంట్ సబ్జెక్ట్ తో రాబోతుందట.. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీయ శరణ్ ను సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. శ్రీయ శరణ్ ఈమధ్య సినిమాల జోరు పెంచింది. లేటు వయసులో కూడా ఘాటు అందాలతో అమ్మడు అవకాశాలను అందుకుంటుంది. సీనియర్ హీరోల సరసన ఛాన్సులు అందుకుంటున్న అమ్మడు పెళ్లి తర్వాత కూడా తన ఫాం కొనసాగిస్తుంది.


ప్రస్తుతం తెలుగులో వెంకటేష్ పక్కన ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా తెలుగులో మరో రెండు అవకాశాలు లైన్ లో ఉన్నాయట. ఈమధ్య క్రేజీ ఫోటో షూట్స్ తో తనలోని మెరుపులు చూపిస్తున్న అమ్మడు చూస్తుంటే మళ్లీ తన స్టార్ క్రేజ్ ఇంకా కొన్నాళ్లు కొనసాగించేలా కననబడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: