తమిళ స్టార్ హీరో సూర్య నటించే సినిమాలకు అక్కడే కాదు టాలీవుడ్ లో కూడా మంచి ఆదరణ ఉంది. గజిని, సింగం సీరీస్ తో మాస్ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న హీరో సూర్య నటించి సినిమాలు ఈ మద్య పెద్దగా టాక్ రావడం లేదు. తమిళంలో నటించిన చాలా వరకు సినిమాలు తెలుగు లో కూడా డబ్ చేస్తున్న విషయం తెలిసిందే.  కోలీవుడ్ లో ఒకవైపున అజిత్ .. మరో వైపున విజయ్ వరుస విజయాలతో దూసుకుపోతుంటే, తనదైన ప్రత్యేకతను నిలుపుకోవడానికి సూర్య విభిన్నమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. 


ఈ మద్య సెల్వ రాఘవన్ సినిమా 'ఎన్జీకే'ను పూర్తిచేశాడు. రకుల్ ప్రీత్ .. సాయిపల్లవి కథానాయికలుగా నటించిన ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నారు.  ఈ సినిమా తర్వాత సూర్య  ప్రముఖ దర్శకులు కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమాల నటిస్తున్నారు. సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం పొల్లాచ్చిలో షూటింగు జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. 


అయితే సూర్య నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ మళియాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఆర్య లు కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నారట. అంతే కాదు తన ప్రతి సినిమాలకు లుకింగ్ లో వేరియేషన్స్ చూపించే సూర్య ఈ సినిమాలో కూడా చాలా డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నారట. ఈ కొత్త లుక్ సూర్య అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతోంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: