రెండురోజుల క్రితం విడుదలైన ‘శైలజా రెడ్డి’ మూవీలో నాగచైతన్య అను ఇమాన్యుయేల్ పై ఒక ముద్దు సన్నివేశం ఉంది. అయితే ఎందుకో ఈ లిప్ లాక్ సీన్ యూత్ కు పెద్దగా కనెక్ట్ కాలేదు. అయితే ఇప్పుడు ఆ సీన్ ను ‘రంగస్థలం’ లో సమంత చరణ్ ల మధ్య సుకుమార్ చిత్రీకరించిన డీప్ లిప్ లాక్ సీన్ తో పోలుస్తూ సమంత అభిమానులు నాగచైతన్యకు ప్రశ్నలు వేస్తున్నారు. 
Ram Charan And Samantha Liplock In Rangasthalam
ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే ‘రంగస్థలం’ విడుదలైన తరువాత సమంత చరణ్ ల మధ్య చిత్రీకరించిన ముద్దు సీన్ పై అప్పట్లో చాల విమర్శలు వచ్చాయి. పెళ్ళి చేసుకుని అక్కినేని కుటుంబ కోడలుగా హోదాను అనుభవిస్తున్న సమంత అలాంటి లిప్ లాక్ సీన్ లో నటించడం ఏమిటి అంటూ అప్పట్లో చైతన్య అభిమానులు సమంతను టార్గెట్ చేసారు. 
Watch Teaser: Samantha Akkineni as Rama Lakshmi in Rangasthalam is an epitome of cheerfulness
ఆ కామెంట్స్ మరీ ఎక్కువై పోవడంతో సమంత రంగంలోకి దిగి తాను చరణ్ బుగ్గ్గల పై మాత్రమే ముద్దు పెట్టుకుంటే అది కెమెరా యాంగిల్ మార్చి చరణ్ పెదవులను ముద్దు పెట్టుకున్నట్లుగా చూపించారు అంటూ వివరణ ఇచ్చింది. దీనితో నాగచైతన్య అభిమానులు అప్పట్లో శాంతించారు. 

అయితే ఇప్పుడు ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీలో చైతన్య  అను ఇమాన్యుయేల్ ల ముద్దు సీన్ చూసిన తరువాత సమంత అభిమానులు చరణ్ ను టార్గెట్ చేస్తూ ముద్దు సీన్స్ లో నటించ కూడదు అన్న నియమం కేవలం పెళ్లి అయిన అమ్మాయిలకు మాత్రమేనా పెళ్లి అయిన అబ్బాయిలకు ఈ నియమం వర్తించదా అంటూ ఏకంగా చైతన్యకే ప్రశ్నలు వేస్తున్నారు. ఈ అనుకోని ప్రశ్నలకు షాక్ అయిన చైతూ ఎలాంటి సమాధానం ఇచ్చి తన పై జరుగుతున్న ఈ మాటల దాడి నుంచి తప్పించుకోగలడో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: