ప్రపంచ వ్యాప్తంగా బిగ్ బాస్ కి ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే.  ఇక బిగ్ బాస్ భారతీయ టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.  బాలీవుడ్ లో ఇప్పటికే కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా పదకొండ సీజన్లు పూర్తి చేసుకుంది.  తెలుగు లో గతంలో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా..ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.  ఇక తమిళంలో కమల్ హాసన్, కన్నడంలో కిచ్చా సుదీప్, మళియాళంలో మోహన్ లాల్ హ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. 

ప్రస్తుతం బాలీవుడ్ వెండితెర, బుల్లితెరపై రాజ్యమేలుతున్నారు సల్మాన్ ఖాన్.  ఓ వైపు బిగ్ బాస్ సీజన్ లో పాల్గొంటునే ‘దస్ కా దమ్’ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం సల్మాన్ ఖాన్  త్వరలో ప్రారంభం కాబోయే ‘బిగ్ బాస్-12’కు పూర్తి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ షో ప్రీమియర్ సెప్టెంబరు 16న జరగనుంది.
Bigg Boss 12,Sreesanth,Neha Pendse
ఇందుకోసం సల్మాన్ కసరత్తులు చేస్తున్నారు.  బిగ్ బాస్ సీజన్ 12 కి సల్మాన్ ఖాన్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారట. తాజాగా సల్మాన్ తన కొత్త లుక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో‌ పోస్టు చేశారు. కొద్ది గంటల వ్యవధిలోనే ఈ పోస్టుకు 11 లక్షల లైకులు వచ్చాయి.  మరి బిగ్ బాస్ 12 సీజన్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: