టాలీవుడ్ లోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు తర్వాత ‘రాజకుమారుడు’సినిమాతో హీరోగా మారాడు.  ఇప్పటి వరకు ఇండస్ట్రీలో పాతిక సినిమాలు కూడా పూర్తి కాకుండానే.. ఉత్తమ నటుడిగా ఐదు నంది అవార్డులు.. ఫిల్మ్ ఫేర్‌లో బెస్ట్ యాక్టర్‌గా మరో ఐదు అవార్డులు.. హీరోగా తొలి సినిమాకి ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు.. పదికి పైగా స్పెషల్ జ్యూరీ అవార్డులు.. ఇదీ మహేష్ ట్రాక్ రికార్డ్.. ఇదే ఆల్ టైం రికార్డ్ ఉన్న మహేష్ బాబును ఘోరంగా అవమానించాడు ఓ తమిళ నటుడు .
Image result for మనోజ్ ప్రభాకర్ మహేష్ బాబు
మహేష్ బాబుకు అసలు యాక్టింగ్ రాదనీ , కత్రినా కైఫ్ కు యాక్టింగ్ రాదని అలాంటి వాడే ఈ మహేష్ బాబు అని ఘోరంగా అవమానించాడు తమిళ నటుడు మనోజ్ ప్రభాకర్.   స్పైడర్ సినిమాలో మహేష్ బాబు నటించిన విషయం తెలిసిందే . ఆ సినిమాలో దర్శకులు ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు కాగా సూర్య అద్భుతంగా నటిస్తుంటే దానికి ఎలా రియాక్షన్ ఇవ్వాలో తెలీక మహేష్ చూస్తుండిపోయాడని , అతడి ఫేస్ కి బండరాయి చక్కటి ఎక్స్ ప్రెషన్ గా మిమిలిపోతుందని కామెంట్ చేసాడు.  దాంతో ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో సైతం ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.  ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా), నడిఘర్ సంఘానికి లేఖ రాసింది.
Image result for మనోజ్ ప్రభాకర్ మహేష్ బాబు
మహేష్ బాబుపై ఇలా ఇష్టారీతిలో కామెంట్స్ చేసిన సదరు వ్యక్తిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొంది. ఇండస్ట్రీలో స్టార్ హోదాలో ఉన్న ఒక హీరోపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించడం సబబు కాదని అన్నారు. కమెడియన్ మనోజ్ ప్రభాకర్ వ్యాఖ్యలు విని షాకయ్యామని, మహేశ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను ‘మా’ తీవ్రంగా ఖండిస్తోందని లేఖలో పేర్కొంది. 

ఇప్పటి వరకు తమిళ, తెలుగు ఇండస్ట్రీలు స్నేహపూర్వకంగా ఉంటున్నాయని..ఇలాంటి చీఫ్  ఇలాంటి తరుణంలో కమెడియన్‌గా ఉన్న ప్రభాకర్ ఇలా తెలుగు హీరోపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో తీవ్ర పరిణామాలు సంతరించుకుంటాయని..ఈ వ్యవహారంపై నడిఘర్ సంఘం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఈ లేఖ ద్వారా కోరింది మా అసోసియేషన్. 



మరింత సమాచారం తెలుసుకోండి: