వైస్సార్ బయో పిక్ యాత్ర చివరి దశకు వచ్చేసింది అయితే ఇంత వరకు జగన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న సంగతీ తెలియడం లేదు. వాస్తవానికి యాత్ర సినిమాకు రెండు స్క్రిప్ట్ లు రెడీ చేసినట్లు బోగట్టా. ఒకటి జగన్ పాత్ర లేకుండా, మరొకటి జగన్ పాత్రతో. ఈ రెండో స్క్రిప్ట్ లో కూడా జగన్ పాత్ర వున్నా జస్ట్ అది ఒకటి రెండు సీన్లకు పరిమితం అని తెలుస్తోంది. కానీ ఈ పాత్రను ఎవరు పోషిస్తారు అన్నది సమస్యగా మారినట్లు తెలుస్తోంది.

వైఎస్ బయోపిక్ కు 'జగన్' సమస్య

అంటే నటుడు దొరక్క కాదు. సూర్య, కార్తీ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. కానీ సమస్య అంతా మమ్ముట్టితో అని తెలుస్తోంది. ఆయన ముందే కండిషన్ పెట్టాడట. తాను సినిమాల్లో తండ్రిగా కనిపించను అని. తాను తెరవెనుక తండ్రిని కానీ, తెరమీద తండ్రిగా కనిపించను, అంతగా తప్పదు అంటే చోటా మోటా నటుడిని ఎవరినన్నా తెస్తే ఓకే కానీ, కాస్త నోటెడ్ నటుడిని తెస్తే తాను చేయనని అంటున్నారట మమ్ముట్టి.

Image result for yatra ysr biopic

దీంతో ఏం చేయాలో తోచక యూనిట్ కిందామీదా అవుతున్నట్లు తెలుస్తోంది. పోనీ దుల్కర్ సల్మాన్ ను తీసుకుందామని, మమ్ముట్టి కొడుకే కదా అని అడిగినా, ఆయన నో అంటున్నారట. స్క్రీన్ మీద తన కొడుకు అయినా సరే తండ్రిగా నటించనని, అది తన పాలసీ అని అంటున్నారట. విజయమ్మగా శరణ్య విషయంలో మమ్ముట్టి అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. తన పక్కన శరణ్య కాస్త ఏజ్డ్ గా కనిపిస్తోందని, వద్దని చెప్పడంతో బాహుబలిలో చిన్న క్యారెక్టర్ వేసిన ఓ అమ్మాయిని విజయమ్మ పాత్రకు తీసుకున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: