గత కొద్ది రోజులుగా మా అసొషియేషన్‌లో వివాదాలు ఇండస్ట్రీని కుదిపేశాయి. శివాజీరాజా, నరేష్‌లు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే వెంటనే నష్టనివారణ చర్యలకు దిగిన ఇండస్ట్రీ పెద్దలు పరిస్థితిని చక్కదిద్దారు.  కొద్దిరోజుల కిందట శివాజీరాజా – నరేష్ ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.  ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ..తప్పు మీరు చేశారంటే..మీరు చేశారని మాటల యుద్దానికి దిగారు.  ఒకదశలో ‘మా’పరువు రచ్చకీడ్చారని విమర్శలు కూడా వచ్చాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ బిల్డింగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి చేత చేయించిన షోలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నరేష్ శివాజీరాజా పైన శ్రీకాంత్ పైన ఆరోపణలు చేసాడు.

Movie artistes association controversy end

ఇక శివాజీరాజా , శ్రీకాంత్ లు ఎలాంటి తప్పు జరగలేదని మీడియా ముందు పేర్కొన్న విషయం తెలిసిందే . ముఖ్యంగా ఈ వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవిని లాగడంతో విషయం కాస్త చిలికి చిలికి గాలి వాన అయ్యింది.  దాంతో మ్యాటర్ కాస్త మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లడంతో ఇరు పక్షాల వారిని పిలిచి సామరస్యంగా సర్ధిచెప్పినట్లు సమాచారం.  ఈ విషయంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వజ ‘అన్ని సంస్థలలో ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇరు వర్గాలు ప్రెస్‌మీట్‌ పెట్టి తప్పు చేశారు.


ఇక నుండి అన్నీ విషయాలను తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే చూసుకుంటుందన్నారు. ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన కలెక్టివ్‌ కమిటీలో ‘మా’లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తేలిందని తెలిపారు. ఇక నుంచి మా అధ్యుక్షుడు శివాజీ రాజా, సెక్రటరీ నరేష్‌లు కలిసి పనిచేస్తారని వెల్లడించారు. భవిష్యత్తులో కలెక్టివ్‌ కమిటీనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుందన్నారు.  ఈరోజు మీడియా ముందుకు వచ్చి  మేమంతా ఒక్కటయ్యాం , విబేధాలు పక్కన పెట్టాం గతం గతః అని సెలవిచ్చారు . ఈ సమావేశంలో అగ్ర నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు , కే ఎల్ నారాయణ , దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ , శివాజీరాజా , నరేష్ లు పాల్గొన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: