యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ సినిమా అరవింద సమేత నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో తారక్ సరసన పూజా హెగ్డే జంటగా నటిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న అరవింద సమేత దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.  రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోతున్నాయి. రఫ్‌గా కనిపిస్తారు కాని.. మాట వింటారు.. పర్లేదు.. అన్న పూజా హెగ్డే డైలాగ్‌కి సిగ్గుపడిపోయిన ఎన్టీవోడు ‘అనగనగగా’ అంటూ పాట అరవింద సమేత వీరరాఘవ మూవీ నుండి తొలి పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది.   

Swaraj

ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో కీలక సన్నివేశాల చిత్రణ సాగుతోంది. సెప్టెంబర్ చివరి వారం నాటికి టాకీ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీపూర్తి చేస్తారు. ఈ సినిమా కోసం నంద‌మూరి అభిమానులంతా ఇప్పుడు ఆస‌క్తిగా చూస్తున్నారు. ‘చీకటి లాంటి పగటి పూట.. కత్తుల్లాంటి పూలతోట.. జరిగిందొక్క వింత వేట.. పులిపై పడిన లేడి కథ వింటావా.. అనగనగనగా.. అరవిందట తన పేరు’ అనే టైటిల్ థమన్ ఎంతో చక్కగా అందించారు.

అన‌గ‌న‌గా ఓ

ఫస్ట్ పార్ట్ లో సిద్ధార్ధ్ గౌతమ్ పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ సెకండ్ ఆఫ్ లో వీర రాఘవగా కనిపించి అలరించనున్నాడట. సెకండాఫ్ లో ఎన్టీఆర్ పాత్ర పవర్ఫుల్ గా ఉండడంతో పాటు ఇది పూర్తి రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ నెల 20న నోవాటెల్లో మూవీ ఆడియో వేడుకని జరపాలని చిత్ర బృందం భావిస్తుందట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కాగా,  తమన్ ఇదివరకూ  బృందావనం రామయ్యా వస్తావయ్యా - రభస చిత్రాలకు సంగీతం అందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: