ఎన్టీఆర్ కథానాయుకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం లో అరవింద సమేత సినిమా దసరా భరిలో ఉన్న సంగతీ తెలిసిందే. ఇప్పటికే ఒక టీజర్ ను మూవీ మేకర్స్ వదిలారు. అది యూట్యూబ్ లో సంచలనం క్రియేట్ చేసింది.  తాజాగా ఈ చిత్రంలోని తొలి లిరికల్ వీడియో ''అనగనగనగా'' సినీ బృందం శనివారం విడుదల చేసింది. ఈ వీడియో మొదట్లోనే ''టఫ్‌గా కనిపిస్తారు కానీ, మాట వింటారు. పర్వాలేదు'' అంటూ వీర రాఘవకు కితాబిస్తోంది అరవింద.

Image result for jr ntr

ఇక ఈ సినిమాలోని తొలి లిరికల్‌ వివరాల్లోకి వెళితే.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు తమన్‌ బాణీలు అందించారు. ''చీకటిలాంటి పగటి పూట.. కత్తుల్లాంటి పూలతోట.. జరిగిందొక్క వింత వేట.. పులిపై పడిన లేడి కథ వింటారా?'' అంటూ ఈ పాట సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ నెల 20న ఆడియో విడుదల వేడుకను నిర్వహించనున్నారు. 
Image result for jr ntr aravinda sametha 
జగపతిబాబు, సునీల్‌, నాగబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తారక్‌.. వీరరాఘవరెడ్డి అనే పాత్రలో చిత్తూరు కుర్రాడిగా, రాయలసీమ యాసలో మాట్లాడతారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా దసరాకు విడుదల కానుంది. హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: