సమంత నాగచైతన్యల మూవీల వార్ రిజల్ట్ బయటకు రావడంతో చైతన్య పై సమంత పై చేయి సాధించింది అని అనుకున్నారు అంతా. అయితే వాస్తవం వేరు. సమంత ‘యూటర్న్’ కు ప్రశంసలు దక్కితే చైతన్య  తాజాగా ‘శైలజా రెడ్డి అల్లుడు’ కు కలక్షన్స్ కురుస్తూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 
Sailaja Reddy Alludu Worldwide Pre Release Business
వాస్తవానికి ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీకి నెగిటివ్ రివ్యూలు రావడమే కాకుండా ఆసినిమాకు డివైడ్ టాక్ వచ్చినా ‘శైలజా రెడ్డి’ కలక్షన్స్  బాగానే వస్తూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఫ్లాప్ గా మారుతుంది అనుకున్న ‘శైలజా రెడ్డి’ నాగచైతన్య కెరీర్ లోనే అత్యధికంగా వసూళ్లు సంపాధించిన సినిమాగా మారడమే కాకుండా ఓవర్సీస్ లో అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’ కంటే ఎక్కువగా ‘శైలజా రెడ్డి’ కి కలక్షన్స్ వచ్చాయి అన్న ప్రచారం జరుగుతోంది. 
U Turn Telugu Movie Review - Sakshi
దీనికితోడు సమంత ‘యూటర్న్’ కు విశ్లేషకుల నుండి ప్రశంసలు లభిస్తున్నా మంచి రేటింగ్ లు దక్కినా ‘యూటర్న్’ కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఈమూవీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన నేపధ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ మరియు మాస్ ఆడియన్స్ ఈ చిత్రంకు దూరంగా ఉంటున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. 
sailaja reddy alludu song video teaser release - Sakshi
ఇది ఇలా ఉండగా ఈమూవీ ఇప్పటికే మన ఇరు రాష్ట్రాలలోను 10 కోట్ల కలక్షన్స్ ను వసూలు చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈమూవీకి సుమారు 18 కోట్ల వరకు ప్రీ రిలీజ్ జరిగిన నేపధ్యంలో ఈఫస్ట్ వీకెండ్ బిజినెస్ షేర్ పోతే మరో ఏడెనిమిది కోట్లు వసూలు చేస్తే ఈమూవీ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అని అంటున్నారు. దీనికితోడు ఈవారం విడుదల కాబోతున్న ‘నన్ను దోచుకుందువటే’ మూవీ ఫలితం కాస్త అటూ ఇటూ గా మారితే ఇక నాగచైతన్యకు ఎదురుండదు అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: