బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో మోస్ట్ టఫ్ కాంపిటీషన్ గా ఉన్న కౌశల్ శనివారం జరిగిన ఎపిసోడ్ చూశాక అతను టైటిల్ గెలవకుండానే ఎలిమినేట్ అవడం గ్యారెంటీ అన్నట్టుగా పరిస్థితులూ కనబడుతున్నాయి. సోమవారం నుండి శుక్రవారం వరకు కంటెస్టంట్స్ నడిపించే షోని శని, ఆదివారాలు మాత్రం హోస్ట్ నాని నడిపిస్తాడు.


ఎప్పటిలానే శనివారం ముందు హాట్ హాట్ గా డిస్కషన్స్ నడిచాయి. కౌశల్ లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్కులో చేసిన పొరపాటుని డిజాస్టర్ అనేశాడు నాని. అంతేకాదు రోల్ రైడాతో అన్న ఓ బూతు మాటని కూడా గుర్తుచేసి కౌశల్ ని ఎటాక్ట్ చేశాడు నాని. ఇది ఓ గేం షో ఇక్కడ మీరు మాట్లాడే ప్రతి మాట కొన్ని కోట్ల మంది దగ్గరకు వెళ్తుదని హెచ్చరించాడు.


ఇక షో మొదలుపెట్టే ముందు పిట్ట కథలను చెప్పే నాని శని వారం రెడ్ చేప.. దాన్ని ప్రేమించే పిల్లాడు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అభిమానం ఉంటే సరిపోదు ఓటింగ్స్ వేయాలంటూ నాని ప్రేక్షకులకు గుర్తుచేశాడు. అయితే నాని చెప్పిన కథ ఎక్సాక్ట్ కౌశల్ గురించే అన్నట్టు కనిపిస్తుంది. 


కౌశల్ ను ఎలిమినేట్ చేసేందుకు భారీ ప్రయత్నాలే జరుగుతున్నాయి. హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా కౌశల్ కనిపిస్తున్నా ఈమధ్య తన ప్రవర్తన మారడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. బయట కౌశల్ ఆర్మీ ఉందని హౌజ్ లో కౌశల్ రిలాక్స్ అయ్యాడని కొందరి వాదన. ఓపక్క కౌశల్ కే టైటిల్ అనేలా సందడి చేస్తుంటే.. కౌశల్ ఎలిమినేట్ అయితే ఎలా ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: