తెలుగు బిగ్ బాస్ లో లీకులు కొనసాగుతున్నాయి.. ప్రతి వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ కు ముందే బయటకు వస్తున్నాయి. లాస్ట్ వీక్ శ్యామలా వెళ్తుందని ముందే చెప్పేయగా ఈ వారం అమిత్ కు బై బై చెప్పేస్తున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ సెకండ్ సీజన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం వల్ల ఈ లీకుల గోల ఎక్కువైంది.


గణేష్, నూతన్ నాయుడుల ఎలిమినేషన్ టైం లో నూతన్ నాయుడు కన్నా అమిత్ కు తక్కువ ఓట్లు వచ్చాయని అమిత్ ఎలిమినేషన్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే అమిత్ ను ఆ వారం సేఫ్ చేసి హౌజ్ లో రెండు సార్లు ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడుని ఎలిమినేట్ చేశారు. 


అంతేకాదు లాస్ట్ వీక్ అమిత్ ఎలిమినేషన్ లో లేకుండా సేఫ్ అయ్యాడు. మొత్తానికి ఈ వారం అమిత్ ఎలిమినేషన్ ఫిక్స్ అయ్యింది. ఆల్రెడీ ముందు రోజే షూట్ చేస్తారు కనుక అమిత్ ఎలిమినేషన్ కన్ఫాం అంటున్నారు. అమిత్ ఎలిమినేట్ అయినట్టు లీకులు బయటకు వచ్చాయి. ఇక మరో రెండు వారాలు మాత్రమే ఉన్న ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.  


కౌశల్, గీతా మాధురి, తనీష్ ల మధ్య గట్టి పోటీ ఉంది. రోల్ రైడా, సామ్రాట్ లలో ఎవరు లాస్ట్ వీక్ ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఈ వారం దీప్తి కూడా సేఫ్ అవుతుందని తెలుస్తుండగా ఫైనల్స్ ఐదుగురిలో దీప్తి కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు నాగార్జున స్పెషల్ గెస్ట్ గా వస్తారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: