లాస్ట్ ఇయర్ రిలీజైన అర్జున్ రెడ్డి సినిమా సంచలనాలు అన్ని ఇన్ని కావు. సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన అతన్ని యూత్ లో స్టార్ గా నిలబెట్టింది. యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ఈ సినిమా మీద ఇతర భాషల వారి కన్ను పడ్డది. అందుకే రీమేక్ రైట్స్ లో కూడా అర్జున్ రెడ్డి అదరగొట్టాడు.


తమిళంలో ఆల్రెడీ వర్మగా రీమేక్ అవుతుంది. అక్కడ విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా చేస్తున్నాడు. హిందిలో సందీప్ వంగ షాహిద్ కపూర్ తో ఈ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా మళయాలంలో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. మల్లూవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కోసం ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు.


అందులో ఒకరు ఆంటోనీ వర్గీస్ కాగా మరొకరి నవీన్ పౌలి. యూత్ లో ఇద్దరికి మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ఇద్దరు మంచి ఫాంలో కూడా ఉన్నారు. ప్రేమంతో నవీన్ సౌత్ లో అందరికి పరిచయం అయ్యాడు. అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించాలని ఆంటోనీ, నవీన్ పౌలిలలో ఒకరు చేస్తున్నారట.


మళయాలంలో ఇలాంటి సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అర్జున్ రెడ్డి తెలుగు వర్షన్ అక్కడ బాగా ఆడింది. ఇక అక్కడ రీమేక్ అయితే ఈ అరొగెంట్ డాక్టర్ చేసే హంగామా ఎలా ఉంటుందో చూడాలి. ఎన్నో భాషల్లో చేసినా అర్జున్ రెడ్డిగా విజయ్ చేసిన పర్ఫార్మెన్స్ ముందు నిలబడరని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: