తమిళ కమెడియన్ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు మీద నోటి కొచ్చినట్టు మాట్లాడినట్లు అందరికీ తెలిసే ఉంటుంది.  దాంతో తెలుగు నటీనటుల సంఘ 'మా'కు పౌరుషం పొడుచుకువచ్చింది. అర్జంట్ గా సంతకు చీటి.. లచ్చికి గాజులు అన్నట్లుగా, తమిళ నడిగర్ సంఘానికి లేఖరాసారు. మాకు మీ నటులు అంటే చాలా గౌరవం వుంది. చెన్నయ్ మర్రిచెట్టు నీడలో పెరిగిన వాళ్లం మేము. మమ్మల్ని, అంటే మా హీరో మహేష్ బాబును ఇలా అనడం తగునా? అంటూ.

Image result for mahesh babu

నిజమే. తప్పే. ఎవరో తమిళ స్టేజ్ కళాకారుడు, ప్రేక్షకులను నవ్వించడం కోసం మన హీరోను తక్కువ చేయడం అంటే తగనిపనే. ఖండించ దగ్గదే. కానీ ఇలా చేయడానికి ఓ పద్దతి వుండాలి. విధి విధానం వుండాలి. సీనియర్ నరేష్ సెక్రటరీ అయితే ఓలా, మహేష్ బాబు మా కోసం ఓ స్పెషల్ ఛారిటీ కార్యక్రమంలో పాల్గొనే వీలు వుండేందుకు వీలుగా ఒకలా చేయకూడదు. అందరు హీరోల పట్ల, అందరి వ్యవహారాల పట్ల ఒకేలా స్పందించాలి కదా?

Image result for mahesh babu

కాస్త వెనక్కు తొంగిచూస్తే, శ్రీరెడ్డి, కత్తి మహేష్ మా సంఘ సభ్యుల విషయంలో విమర్శలు చేసిన రోజులు గుర్తురాలేదా? అవన్నీ వివాదాలు అయిన సంగతి గుర్తులేదా? ఇప్పటికీ శ్రీరెడ్డి సినిమాజనాలను టార్గెట్ చేస్తూనే వున్నారుగా? ఇక ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మెగా హీరోల విషయంలో తన చిత్తానికి వచ్చినట్లు విమర్శలు చేసిన సంఘటనలు వున్నాయి. మరెప్పుడూ మా కలుగ చేసుకోలేదే? ఖండించలేదే? ఎవరికీ లేఖలు రాయలేదే?


మరింత సమాచారం తెలుసుకోండి: