రాజమౌళి అంతగా దేవుడుని నమ్మడు. అందువల్లనే అతడు ప్రముఖ ఆలయాల చుట్టూ స్వామీజీల చుట్టూ ప్రదక్షణాలు చేయడు. అయితే రాజమౌళి తీసిన చాల సినిమాలలో శివుడి ప్రస్తావన ఉంటుంది. వీటి అన్నింటిని మించి రాజమౌళి ఇంటిపేరు వేరు అయినా శ్రీశైల రాజమౌళిగా పిలివబడుతూ ఉంటాడు.
RRR movie
ఇప్పుడు రాజమౌళి భారీ మల్టీ స్టారర్ ప్రారంభానికి ముహూర్తం ఖరార్ కావడం వెనుక మళ్ళీ శివుడి సెంటిమెంట్ ప్రభావితం చేసింది అన్నవార్తలు వస్తున్నాయి. జూనియర్ చరణ్ లతో రాజమౌళి తీయబోతున్న భారీ మల్టీ స్టారర్ కు ముహూర్తం ఫిక్స్ అయినట్లు టాక్. డిసెంబర్ 15 నుంచి ముహుర్తాలు ఉండవు కాబట్టి ఆలోపు ముహుర్తం చేసి ఒక వారం పది రోజులు షూట్ చేసి గ్యాప్ ఇవ్వాలని దర్శకుడు రాజమౌళి డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  

ఈగ్యాఫ్ ఇవ్వడానికి గలకారణం రమా రాజమౌళిల కుమారుడు కార్తీకేయ పెళ్లి డిసెంబర్ లో ఫిక్స్ కావడం. ఆవ్యవహారాల్లో రాజమౌళి బిజీగా ఉంటాడు కాబట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభ ముహూర్తాన్ని కార్తీకమాసం అయిన నవంబర్ లో వచ్చే విధంగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ హడావిడి నుండి అక్టోబర్ రెండోవారం తరువాత ఫ్రీ అయిపోతాడు. 
SS Rajamouli announces new film with Jr NTR and Ram Charan Teja - Sakshi
అదేవిధంగా రామ్ చరణ్ తాను నటిస్తున్న బోయపాటి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నవంబర్ మొదటి వారానికి ఫ్రీ అవుతాడు. దీనితో వీరిద్దరినీ కలిపి రాజమౌళి తనకు సెంటిమెంట్ గా కలిసి వచ్చే కార్తీకమాసం అయిన నవంబర్ నెలలో ఈమూవీ షూటింగ్ ను ప్రారంభించి కనీసం ఒక పది రోజులు షూట్ నిర్వహించి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను పట్టాలు ఎక్కించాలి అని డిసైడ్ అయినట్లు టాక్. ఆతరువాత కార్తికేయ పెళ్ళి హడావిడి ముగిసిన తరువాత తిరిగి సంక్రాంతి తరువాత తన సినిమా పై రాజమౌళి దృష్టి పెడతాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: