విజయాలతో దూసుకుపోతున్న సమంత అక్కినేని కుటుంబ కోడలు అయిన తరువాత తన ఆలోచనలలో మార్పులు తెచ్చుకుని డిఫరెంట్ సినిమాల ఎంపిక పై దృష్టి పెడుతూ కొత్తపాత్రలు చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈనేపధ్యంలో గతవారం విడుదలైన ‘యూటర్న్’ కు ప్రశంసలతో పాటు ఆర్ధిక విజయం కూడ లభించడం సమంత తన దూకుడును మరింత పెంచేలా చేసింది. 
samantha u turn release on september 13th
‘యూటర్న్’ సినిమాను ప్రమోట్ చేస్తూ సమంత ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అక్కినేని ఫ్యామిలీతో సంబంధం లేకుండా నాగార్జున చైతన్యల  డబ్బులు వాడకుండా తన సొంత డబ్బులతోనే సినిమాలు తీస్తానని తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

samantha u turn movie promotions - Sakshi

అంతేకాదు అన్నపూర్ణ స్టూడియోస్ ‘మనం’ ఎంటర్ టైన్ మెంట్స్ ఈరెండు నిర్మాణ సంస్థలు తమ కుటుంబానికి సంబంధించినవే అయినా ఆ ప్రొడక్షన్ హౌస్ ల పేర్ల పై తాను సినిమాలు తీయను. తన డబ్బుతోనే తానే సొంతంగా చిన్న సినిమాలు నిర్మిస్తాను అంటూ ప్రకటన ఇచ్చింది. అంతేకాదు తాను తీసే సినిమాలకు సంబంధించిన టైటిల్ కార్డ్స్ లో నిర్మాతగా తన పేరు సినిమా స్క్రీన్ పై చూసుకోవాలని ఉంది అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.


ఒకరకంగా సమంత లేటెస్ట్ నిర్ణయం నాగార్జున చైతన్యలకు షాక్ ఇచ్చే అంశం అని అంటున్నారు. స్వతంత్ర భావాలు ఉన్న సమంత తన నిర్ణయంలో మార్పులేదని ప్రకటించడంతో నాగార్జున ఈవిషయమై తన కోడలకు ఎటువంటి సలహాలు ఇస్తాడు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. దీనికితోడు కొత్త టాలెంట్ ను వెలికి తీస్తూ కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తూ ఇప్పటికే వచ్చిన సినిమాలలో చాల కొద్దిగానే విజయవంతం అయిన నేపధ్యంలో ఈఅనుభవాల రీత్యా సమంత ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేది రానున్న రోజులలో తెలుస్తుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: