బూతు సినిమాల దర్శకుడుగా తన కెరియర్ ప్రారంభించి ప్రస్తుత్తం ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు స్థాయికి ఎదిగిన మారుతి ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిలిం ఇండస్ట్రీ గురించి ముఖ్యంగా టాప్ హీరోల సినిమాల దర్శకుల గురించి కొన్ని ఆసక్తికర  కామెంట్స్ చేసాడు. చిన్న సినిమాలు తీసినంత సులువుగా టాప్ హీరోలతో సినిమాలు అందరూ తీయలేరనీ అంటూ మారుతి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.
Maruthi director
టాప్ హీరోతో సినిమా తీయడానికి నిర్మాత దొరికాడు కదా అనీ ఎవరో ఒక టాప్ హీరోను పట్టుకుని సినిమాలు తీయాలని చాలమంది ప్రయత్నిస్తున్న విషయాల గురించి ప్రస్తావిస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఒక్క టాప్ హీరో సినిమా ఫెయిల్ అయితే చాలు ఆఫలితం వల్ల రోడ్డుమీద పడ్డ ఎందరో నిర్మాతలు దర్శకులు డిస్ట్రిబ్యూటర్ల జీవితాలను తాను చూసాను అని అంటూ టాప్ హీరోలతో సినిమాలు తీసి పెద్దపెద్ద నిర్మాతల బ్యానర్లు ఎగిరిపోయిన విషయాలను మారుతి వివరించాడు. 
Maruthi Interview photos (82)
పెద్ద హీరోలతో సినిమాలు తీయాలి అంటే అది ఒక పెద్ద బాధ్యత అనీ అటువంటి బాధ్యతను అనుభవంతో ఓపికగా మోసే శక్తి తనకు లేదు అంటూ మారుతి తన పై తానే కామెంట్స్ చేసుకున్నాడు. విశ్వనాథ్ సినిమాలు అంటే తనకు ఇష్టమని అయితే ఆయన స్థాయిలో తాను సినిమాలను తీయాలని ప్రయత్నిస్తే జీవితంలో ఫెయిల్ అవ్వడం ఖాయం అని అంటున్నాడు. 

మచిలీపట్నంలో అరటిపండ్లు అమ్ముకుంటూ రోజుకు 50 రూపాయలు సంపాదించే కుటుంబలో తాను పుట్టిన విషయాన్ని  బయటపెడుతూ తనకు జీవితంలో విపరీతంగా డబ్బులు గణించాలి అన్న కోరికలు లేవు అని అంటున్నాడు. అంతేకాదు ప్రతి వ్యక్తి టాప్ డైరెక్టర్ కాలేడనీ ప్రయత్నిస్తే మంచి డైరెక్టర్ గా మారే ఆస్కారం ఉంది అంటూ డబ్బులు పోతే ఎవరూ ఇవ్వరు కేవలం సానుభూతి మాత్రమే చూపెడతారు అని అంటూ ‘ఇగో’ అన్నది కేవలం డబ్బున్న వారిలోనే ఉండదనీ ఏమీ లేని వారి దగ్గర కూడ ‘ఇగో’ ఎక్కువగా కనిపిస్తున్న ఈరోజులలో ఆ ‘ఇగో’ ను బేస్ చేసుకుని నిర్మించిన సినిమా ‘శైలజా రెడ్డి అల్లుడు’ అని అంటున్నాడు ఈచిన్న సినిమాల దర్శకుడు..  



మరింత సమాచారం తెలుసుకోండి: