కామెడీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, అను ఇమాన్యుఎల్  నటించిన  శైలజారెడ్డి అల్లుడు  వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్13న విడుదలైన విషయం తెలిసిందే.  మొదట ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినా..తర్వాత పాజిటీవ్ టాక్ వచ్చింది.  దాంతో కలెక్షన్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’ మూడు రోజుల్లో 23 కోట్ల గ్రాస్ వసూళ్ళని సాధించి కెరీర్ బెస్ట్ వసూళ్లని సాధించాడు అక్కినేని నాగచైతన్య.
Image result for shailaja reddy alludu anu imnua
మొదటిరోజున 12 కోట్లు వసూల్ చేసిన శైలజారెడ్డి అల్లుడు రెండో రోజు , మూడో రోజు కూడా అదే జోరు చూపించడంతో 3 రోజుల్లో 23 కోట్ల వసూళ్లు వచ్చాయి. అయితే వీక్ ఎండ్ మనోడికి బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు.  అయితే అదే రోజు నాగచైతన్య సతీమణి సమంత నటించిన ‘యూటర్న’ఓ మర్డర్ మిస్టరికి సంబంధించిన సినిమా రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా కూడా మిశ్రమ స్పందన వచ్చింది..కానీ పెద్దగా వసూళ్లు రాబట్టలేక పోతుంది.  ఆదివారం కూడా మంచి వసూళ్లు రావడం ఖాయం దాంతో 28 లేదా 30 కోట్ల గ్రాస్ వసూళ్లు రావచ్చు .
Image result for shailaja reddy alludu anu imnua
అయితే శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి రేపటి నుండి అసలు పరీక్ష మొదలుకానుంది. ఆ రోజు నుంచి మనోడికి అగ్ని పరీక్ష మొదలవుతుంది..వాస్తవానికి ఈ వారంలో మొత్తం పెద్దగా పోటీ సీనిమాలు ఏవీ లేవు..అందుకే వసూళ్లు వేగం ఎక్కడా తగ్గక పోవొచ్చని అంటున్నారు సినీ విశ్లేషలకులు. అలా వసూల్ చేసినట్లయితే శైలజారెడ్డి అల్లుడు లాభాలబాటలో పయనించినట్లే.. 24 కోట్ల బిజినెస్ జరిగింది శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి అయితే ఇప్పటి వరకు 12 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది అంటే సగం రాబట్టినట్లు. దాంతో  బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వస్తారు. వాళ్ళు సేఫ్ జోన్ లోకి రావాలంటే ఈ వారం రోజులు శైలజారెడ్డి అల్లుడు కుమ్మేయ్యాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: