ఈ మద్య చిత్ర పరిశ్రలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల నుంచి తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో పలువురు నటీ,నటుల మరణం ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచివేస్తుంది.  తాజాగా శత్రువు, రౌడీ అల్లుడు, కొండపల్లి రాజా, గాంఢీవం, మొండి మొగుడు పెంకి పెళ్లాం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు.. కెప్టెన్ రాజు(68) నేటి(సోమవారం) ఉదయం మృతి చెందారు. 


గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు.  కొన్ని నెలల క్రితం.. రాజు అమెరికాకు ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండగా స్ట్రోక్‌తో బాధపడ్డారు. రాజు తన పరిస్థితిని తెలియజేసిన తరువాత, విమానాన్ని దారి మళ్లించి మస్కట్‌లో లాండ్ చేసింది సిబ్బంది. రాజు ఫ్యామిలీ అభ్యర్థన మేరకు, ఆయన్ను మస్కట్ నుంచి కొచ్చికి చికిత్స నిమిత్తం పంపించారు. ఆ సమయంలో ఆయన కండీషన్ స్థిరంగానే ఉంది.


ఇండియన్ ఆర్మిలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు.  తెలుగు సినిమా బలిదానంతో వెండితెరకు పరిచయమైన ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో సుమారు 500పైగా చిత్రాల్లో నటించారు. చివరి సారిగా మలయాళ చిత్రం ‘‘ మాస్టర్ పీస్‌లో’’ కనిపించారు. ఆయన 500లకు పైగా చిత్రాల్లో రాజు నటించారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: