తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన రాంచరణ్ తన రెండో చిత్రంతోనే రికార్డుల మోత మోగించడం ప్రారంభించాడు.  ఇండస్ట్రీలో రాంచరణ్ నటించిన చిత్రాలు తక్కువే అయినా దాదాపు అన్ని సూపర్ హిట్ చిత్రాలు కావడం విశేషం.  ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత నటించిన ‘రంగస్థలం’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఇక చిత్రం విషయానికి వస్తే..1985 కాలం నాటి గ్రామీణ వాతావరం..అప్పటి రాజకీయాలు ఏలా ఉండేవి..సెంటిమెంట్, ఎమెషన్స్ అద్బుతంగా పండించారు దర్శకులు సుకుమార్. 

ఇక చిట్టిబాబుగా చెవిటి వాడి పాత్రలో రాంచరణ్ నటన అద్భుతం..విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు.  పల్లెటూరి అమ్మాయిగా రామలక్ష్మి పాత్రలో సమంత కూడా అద్భుతంగా నటించింది.  ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా రంగమ్మత్తగా నటించి మంచి పేరు తెచ్చుకుంది.  ఇక ఈ చిత్రం మ్యూజిక్ పరంగా కూడా సూపర్ హిట్ అయ్యింది.
Related image
మొత్తానికి  విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది.   దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అద్భుతం..ముఖ్యంగా గోదావరి యాసతో 'రంగమ్మా, మంగమ్మా... ఏం పిల్లడూ.. పక్కనే ఉంటాడమ్మ... పట్టించుకోడు' అనే పాట సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పాట సోషల్ మీడియాలో 10 కోట్ల వ్యూస్ ను దాటేసి రికార్డు క్రియేట్ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: