రోజురోజుకు అంచనాలు పెరుగుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కు సంసంబంధించి బాలకృష్ణ అనుసరిస్తున్న వ్యూహాలు రామ్ చరణ్ వెంకటేష్ లకు కలవర పాటుకు గురిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతికి విడుదలకు రెడీ అవుతున్న ఈమూవీకి  గట్టి పోటీలేకుండా చూసుకోవాలని ఇప్పటినుంచే బాలకృష్ణ ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి.   ఈప్రయత్నాలకు రాయబారిగా ప్రముఖనిర్మాత దగ్గుబాటి సురేష్ బాబును బాలకృష్ణ రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
 Balakrishna in NTR biopic
ఇప్పటికే వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న నేపధ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా విడుదలకాబోతున్న దానయ్య నిర్మాణంలోని రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్ లో తయారవుతున్న భారీ సినిమాను సంక్రాంతి రేసు నుండి తప్పించి జనవరి 26తారీఖున విదుదల చేసాలా బాలయ్య రాయబారాలు నడుపుతున్నట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈప్రయత్నాలకు దర్శకుడు బోయపాటి సహాయం కూడ బాలయ్య అడిగినట్లు టాక్.  
 NTR-Biopic-Movie-Launch-Photos (1)
అయితే ఈవిషయం తెలిసి ఇప్పటికే  ఈసినిమా టోటల్ రైట్స్ ను 70కోట్లకు కొనుక్కున్న యూవీ  క్రియేషన్స్ సంస్థ తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. ఈసినిమా సంక్రాంతికి రాకపోతే  తాము ముందు అనుకున్నట్లు 70కోట్లు ఇచ్చి ఈసినిమాను తీసుకోమని ఇప్పటికే నిర్మాత దానయ్యకు క్లారిటీగా చెప్పేసినట్లు తెలుస్తోంది. 
దీనితో ఇలా కుదరకుంటే కనీసం దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి వెంకీ వరుణ్ తేజ్ ల ‘ఎఫ్ 2’ అయినా సంక్రాంతి రేస్ నుండి తప్పించి ఈ సక్రాంతి రేస్ కు జరగబోతున్న త్రిముఖ పోటీని అయినా తప్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఎన్టీర్ లాంటి గొప్ప వ్యక్తి పై తీస్తున్న బయో పిక్ కాబాట్టి ఈసినిమాకు తక్కవ పోటీ ఉండేలా ప్రయత్నించాలని బాలకృష్ణ ఆలోచనా అనిఅంటున్నారు. 
NTR Biopic For Dussehra, Really Possible?
దీనితో రాబోతున్న ఒత్తిడిలను గ్రహించి రామ్ చరణ్ బోయపాటిల సినిమాకు ‘ఎఫ్ 2’ సినిమాకు సంబంధించి సంక్రాంతి రేస్ లో ముందుగానే థియేటర్ల బుకింగ్ పూర్తిచేసి ఈఒత్తిడి వ్యూహాల నుంచి తప్పించుకోవాలని నిర్మాతలు దానయ్య దిల్ రాజ్ లు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఇది ఇలాఉండగా ఎన్టీర్ బయో పిక్ విషయంలో అమెజాన్ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన మేకింగ్ వీడియోస్ ను అమెజాన్ ప్రైమ్ లో జనం చూసే విధంగా ఒకభారీ డీల్ కోసం బాలయ్య ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఎన్టీర్ బయోపిక్ తో పేరుతోపాటు కోట్లు కూడ కొల్లగొట్టాలని బాలకృష్ణ భారీప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: