ప్రస్తుతం జార్జియా దేశంలో ‘సైరా’ మూవీకి సంబంధించిన భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సురేంద్ర రెడ్డికి ‘సైరా’ మూవీకి సంబంధించి చిరంజీవి పై చిత్రీకరించవలసిన యంగ్ లుక్ పాత్ర విషయంలో కొన్ని సమస్యలు ఎదురౌతున్నట్లు టాక్. ప్రధమ స్వాతంత్ర సంగ్రామానికి ముందు జరిగిన ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ కథకు సంబంధించి ఆపాత్ర యుక్త వయసుకు సంబంధించిన కొన్ని సీన్స్ తీయవలసిన పరిస్థితి ఆకథ రీత్యా సురేంద్ర రెడ్డి పై పడిందని అని తెలుస్తోంది. 
 బ్రిటిష్ కోటపై దండయాత్ర
అయితే ప్రస్తుతం చిరంజీవి వయస్సు 64 సంవత్సరాలు అయిన నేపధ్యంలో చిరంజీవి యంగ్ లుక్ ఎలా తీర్చిదిద్దాలి అన్న విషయమై సురేంద్ర రెడ్డి అనేకమంది ప్రముఖ మేకప్ ఆర్టిస్టులతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇప్పటి దాకా ఈసినిమాకు సంబంధించి చిరంజీవిని ఒక పోరాట యోధుడుగా మధ్య వయస్సు పాత్రలో చూపెట్టిన నేపధ్యంలో చిరంజీవి వయసు ‘సైరా’ చిత్రీకరణకు ఎటువంటి అడ్డంకినీ సృష్టించలేదు. 
 అందాల తారలంతా
అయితే ఇదే సినిమాలోని నరసింహా రెడ్డి యుక్త వయస్సుకు సంబంధించిన సీన్స్ కూడ కీలకం కావడంతో చిరంజీవి హెయిర్ స్టైల్ అదేవిధంగా మీసకట్టు అలనాటి పరిస్థుతులకు ప్రతిబింబించేలా ఎలా ఉండాలి అన్న కోణంలో సురేంద్ర రెడ్డి ఈపాత్రకు సంబంధించి కొన్ని ఊహా చిత్రాలు ఆర్టిస్టుల చేత వేయిస్తున్నట్లు టాక్. ఈ చిత్రాలను బట్టి చిరంజీవి యంగ్ లుక్ ఎలా ఉంటే బాగుంటుంది అన్న అవగాహనకు రావాలని సురేంద్ర రెడ్డి ఆలోచన అని అంటున్నారు. 
 హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్
ప్రస్తుతం జార్జియాలో చిత్రీకరిస్తున్న వార్ సీన్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత ఇండియాకు తరిగి వచ్చి చిరంజీవి యంగ్ లుక్ ను ఫైనల్ చేసి రాబోతున్న దసరాకు చిరంజీవి యంగ్ లుక్ కు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి కాస్ట్యూమ్స్ డిజైనింగ్ విషయంలో సురేంద్ర రెడ్డి చిరంజీవి కుమార్తె  సుష్మిత సలాహాలు కూడ తీసుకుంటున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: