ఈ మద్య కొంత మంది సెలబ్రెటీలు చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ కావడం..నోరు పారేసుకోవడం..అవతలి వ్యక్తులపై చిందులు వేయడం జరుగుతుంది.  ఆ తర్వాత అసలు వాస్తవం తెలుసుకొని సారీ అని చెప్పడం కామన్ అయ్యింది.  తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ జర్నలిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన తీరుపై మీడియా వర్గాల్లో విమర్శలు గుప్పించడంతో క్షమాపణలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టారు.  కేరళ వరద బాధితులకు సహాయం చేయడానికి విశ్వశాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి మోహన్ లాల్ హాజరయ్యారు. కాగా, ఈ ఫౌండేషన్ తన తల్లిదండ్రుల పేరిట నిర్వహిస్తున్నారు.   


ఈ కార్యక్రమానికి హాజరైన ఓ జర్నలిస్ట్ క్రెస్తవ నన్ పై జరిగిన అత్యాచారం గురించి స్పందించమని మోహన్ లాల్ ని అడిగారు..దానికి స్పందించిన మోహన్ లాలు ఆవేశంతో ఆ జర్నలిస్ట్ పై ఫైర్ అయ్యారు..నీకు సిగ్గుఉందా..ఎక్కడకొచ్చి ఏం మాట్లాడుతున్నావ్..అన్నారు.  అయితే ఒక సెలబ్రెటీ హోదాలో ఉన్న వ్యక్తి నోరు జారితో అది ఎంతో పెద్ద పరిణామాలకు దారి తీస్తుందో అందిరికీ తెలిసిందే..అలాంటిది సమస్యలను లేవనెత్తే జర్నలిస్ట్ ల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్దతి కాదని నెటిజన్లు సీరియస్ అయ్యారు. 


 దీంతో మోహన్ లాల్ ఆ జర్నలిస్ట్ కి క్షమాపణ చెబుతూ ఓ పోస్ట్ పెట్టారు. ''నా సమాధానం మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను మీ పెద్ద అన్నగా భావించి క్షమాపణలు స్వీకరించండి. రద బాధితుల సహాయక చర్యల గురించి నేను మీడియాతో మాట్లాడుతున్న సమయంలో దానికి సంబంధం లేని ప్రశ్న ఎదురుకావడంతో నేను అలా స్పందించాను.  మీరు లేవనెత్తిన ప్రశ్న సరైనదే..ఆ సమయానికి నేను సంయమనం పాటించాల్సింది..అలా మాట్లాడకుండా ఉండాల్సిందని తనను మనస్ఫూర్తిగా క్షమించమని కోరారు మోహన్ లాల్. 


మరింత సమాచారం తెలుసుకోండి: