‘శైలజా రెడ్డ్డి అల్లుడు’ ఓపెనింగ్స్ తో పోల్చుకుంటే ఓపెనింగ్స్ కలెక్షన్స్ విషయంలో వెనకపడ్డ సమంత ‘యూటర్న్’ ఆతరువాత ఈమూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ తో స్థిరపడింది. ఈమూవీ వీకెండ్ పూర్తి అయ్యే సరికి 16 కోట్ల షేర్ తెచ్చుకోవడం టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. నిన్నటి రోజు పరీక్షలో కూడ ‘యూటర్న్’ కు మంచి కలక్షన్స్ రావడంతో ఈమూవీని హిట్ జాబితాలో చేర్చేసారు. 

వాస్తవానికి సమంత మార్కెట్ కు ముంచి ‘యూటర్న్’ సమంత బ్యాగ్ నింపింది అన్న వార్తలు వస్తున్నాయి. ‘యూటర్న్’ సినిమాకు ఒప్పుకునే ముందు సమంత కేవలం అడ్వాన్స్ మాత్రమే తీసుకుని ఆమూవీకి జరిగే బిజినెస్ లో షేర్ అడిగినట్లు సమాచారం. ఈమూవీ నిర్మాతలు సమంత సూచనను అప్పట్లో ఆనందంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ వ్యూహమే సమంతకు ‘యూటర్న్’ విజయం వల్ల సుమారు 4 కోట్ల పారితోషికం వచ్చేలా చేసిందని అంటున్నారు. 
samantha u turn release on september 13th
‘రంగస్థలం’ లాంటి భారీ సినిమాలో నటించిన సమంతకు కేవలం 1.25 కోట్ల పారితోషికం వస్తే ‘యూటర్న్’ లో నటించడం వల్ల సమంతకు 4 కోట్ల పారితోషికం షేర్ రూపంలో రావడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి దక్షిణ భారత సినిమా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ నయన తార. అయితే ఇప్పుడు సమంతకు ‘యూటర్న్’ వల్ల పారితోషికంగా వచ్చిన  లాభాల విషయాలను పరిగణిస్తే నయనతార కన్నా ఎక్కువ పారితోషికం పుచ్చుకున్న హీరోయిన్ గా సమంత రికార్డ్ క్రియేట్ చేసింది. 
trade: a risky turn for samantha's film
ఇప్పుడు సమంతకు కొనసాగుతున్న మ్యానియాతో అతి త్వరలో ప్రారంభం కాబోతున్న చైతు సమంతలు భార్య భర్తలుగా నటించ బోతున్న దర్శకుడు శివ నిర్వాణ మూవీ బిజినెస్ అత్యంత భారీ స్థాయిలో జరిగే ఆస్కారం ఉంది. ఏది ఏమైనా గడిచిన వారం సమంత చైతన్యల సినిమాలు ఒకేసారి విడుదలై కలక్షన్స్ విషయంలో సంచలనాలు సృష్టించడంతో గత వారం సమంతా చైతన్యల ‘కపుల్ వీక్’ గా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మారిపోయింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..     


మరింత సమాచారం తెలుసుకోండి: