మళయాల ప్రేమమ్ నుండి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అందం, అభినయం రెండు ఉన్నా ఎందుకో అమ్మడు సరైన ఫలితాలను అందుకోలేదు. యువ హీరోలతో వరుస అవకాశాలను అందుకుంటున్నా వాటిని సక్సెస్ బాట మాత్రం పట్టించడంలో విఫలమవుతుంది అనుపమ. 


ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో హలో గురు ప్రేమ కోసమే సినిమా చేస్తుంది అనుపమ. ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజైంది. టీజర్ చూస్తే అనుపమ ఇదవరకు సినిమాల కన్నా హాట్ గా కనిపిస్తుంది. ఇన్నాళ్లు క్యూట్ గా కనిపించినా లాభం లేదని గుర్తించిన అమ్మడు ఇక తనలోని హాట్ యాంగిల్ బయట పెడుతుంది.  


అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ ప్రేమం, శతమానం భవతి సినిమాలతో హిట్ అందుకుంది. ఉన్నది ఒకటే జిందగి, తేజ్ ఐలవ్యూ సినిమాలు నిరాశ పరచినా అనుపమ ఈసారి హలో గురు ప్రేమ కోసమే సినిమాలో తన గ్లామర్ షోతో స్పెషల్ గా కనిపిస్తుంది.


ఇలా కనిపిస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారని గుర్తించిందో ఏమో నిమిషం నిడివి గల టీజర్ లోనే అనుపమ అందాలతో అదరగొట్టింది. ఇక సినిమా మొత్తం ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో రాం, అనుపమ రొమాన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: