తెలంగాణలో ఇప్పుడు ముందస్తు ఎన్నికలు నిర్వహించబోతున్న విషయంలో పలువురు రాజకీయ నాయకులు రక రకాలుగా స్పందిస్తున్నారు.  మరోవైపు అన్ని పార్టీలు తమ వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. తాజాగా సినీ నటి గౌతమి తెలంగాణ ముందస్తు ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణలో ముందస్తుతో ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందన్న విషయాన్ని తొలుత పక్కన పెట్టాలని, కానీ, తమకు మేలు జరుగుతుందన్న నమ్మకంతో మంచి మెజారిటీ ఇచ్చి, నిండు ఐదేళ్లూ ప్రభుత్వాన్ని నడిపించాలని ప్రజలు కోరుకుంటారని గౌతమి అభిప్రాయపడింది.

Image result for telangana

ప్రతి ఒక్క ఓటరు మాకు అన్ని పనులూ జరుగుతాయి... మా భవిష్యత్‌ను సరిదిద్దుతారు  అనే నమ్మకంతో ప్రజలున్నప్పుడు... ముందస్తు ఎన్నికలతో ప్రజలకు ఎంతవరకూ న్యాయం చేయగలుగుతున్నామనేది ఆలోచించాల్సిన విషయం  అని గౌతమి చెప్పుకొచ్చారు.  ఐదేళ్లూ అధికారంలో ఉండి ప్రజా సంక్షేమంపై ముందుకెళ్లకుండా, ముందుగానే ఎన్నికలకు వెళ్లడం ఏంటని ప్రశ్నించింది.


ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడంపై ఆమె స్పందించారు. ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావడమనేది వాళ్ల సొంత విషయం. ప్రతి ఒక్కరి కమిట్‌మెంట్‌ను బట్టి వాళ్లు తీసుకునే నిర్ణయం.  రాజకీయాల్లోకి రావడం అంటే ప్రజల బాధ్యత తీసుకోవడం..వారికి సరైన న్యాయం చేయడం కోసమే అని భావించాలి.  రాజకీయా ప్రయాణం ఒకరోజులోనో లేదంటే ఆరు నెలల్లోనో తెలిసేది కాదు. ఎక్కడ ప్రజలకు మంచి జరుగుతుందో అక్కడ నా సపోర్ట్ ఉంటుందని అన్నారు గౌతమి. 

మరింత సమాచారం తెలుసుకోండి: