తెలుగు ఇండస్ట్రీలో నటకిరీటిగా గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజేంద్ర ప్రసాద్ తండ్రి, మామ పాత్రల్లో నటిస్తున్నారు.  తాజాగా ‘నటకిరీటీ’ రాజేంద్రప్రసాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల న్యూజెర్సీలోని జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్‌ ‘సెనేట్ లైఫ్ అచీవ్‌మెంట్’ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. 

 తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. సిడ్నీలోని పార్లమెంట్ హాలులో ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో విశిష్టమైన సేవలు అందించి..ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన నటకిరీటీ రాజేంద్రుడికి జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు.  అందులో భాగంగా ఆస్ట్రేలియా సాంస్కృతిక శాఖ రాజేంద్రప్రసాద్‌కు అరుదైన గౌరవాన్ని కల్పించింది.భారతదేశం నుంచి నటుడిగా ఈ పురస్కారం అందుకున్న తొలి ఆర్టిస్టుగా రాజేంద్రప్రసాద్ చరిత్ర సృష్టించారు.

దశాబ్దాల సినీ కెరీర్‌లో దాదాపు 240 సినిమాల్లో నటించారు రాజేంద్రప్రసాద్.  తనకు ఇంతటి ప్రాధాన్యత ఇచ్చినందకు ఎంతో సంతోషం అని..తన ఎదుగుదలకు దర్శకనిర్మాతలు, ప్రేక్షకుల ఆదరణే అందుకు కారణమని నిర్మొహమాటంగా చెప్పారు.  ఈ ఏడాది మే నెలలో న్యూజెర్సీ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న రాజేంద్రుడు.. తన అవార్డును తెలుగు చిత్ర ప‌రిశ్రమ‌కు అంకితం చేసిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: