‘అజ్ఞాతవాసి’ షాక్ నుండి తేరుకోవాలని త్రివిక్రమ్ తన సర్వశక్తులు ధారపోసి జూనియర్ తో ‘అరవింద సమేత’ తీస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో త్రివిక్రమ్ ఈసినిమా గురించి చేస్తున్న ప్రయోగాలలో తిరిగి పవన్ జ్ఞాపకాలు వెంటాడటం హాట్ టాపిక్ గా మారింది. త్రివిక్రమ్ కు జానపద సంగీతం అంటే విపరీతమైన మోజు.

ఆ మోజుతోనే పవన్ ‘అత్తారింటికి దారేది’ లో ‘కాటమరరాయుడా’ అంటూ ఒక పాటను ‘అజ్ఞాతవాసి’ లో ‘కొడకా కోటేశ్వరరావు’ అంటూ ఈరెండు జానపద బాణీలతో ఉండే పాటలను తన సినిమాలలో పెట్టి పవన్ అభిమానులకు జోష్ ను కలిగించడానికి తన వంతు ప్రయత్నం చేసాడు. ఇప్పుడు అదే ప్రయోగం త్రివిక్రమ్ తన ‘అరవింద సమేత’ లో జూనియర్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాడు. 
Jr NTR in Aravinda Sametha
ఈమూవీకి సంబంధించిన రెండో సాంగ్ గా ‘పెనివిటి’ అని సాగే పాటను ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు విడుదల చేయబోతున్నారు. రాయలసీమ యాసలో ఈపాట ఉండనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సంగీతదర్శకుడు తమన్ కు జానపద బాణీలో ఉండే పాటలను కంపోజ్ చేయడంలో ఒక ట్రాక్ రికార్డు ఉంది. గతంలో తమన్ జూనియర్ నటించిన ‘బాద్ షా’ మూవీలో ‘బంతిపూల జానకి’ అంటూ ఫోక్ టచ్ ఉండే పాటకు ట్యూన్ ఇచ్చాడు. 
‘అరవింద సమేత’ అంచనాలు రెట్టింపు
అప్పట్లో ఆపాట జూనియర్ అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ జూనియర్ అభిమానుల కోసం త్రివిక్రమ్ తమన్ లు కలిసి చేస్తున్న ఈ ‘పెనివిటి’ ప్రయోగంతో ‘అరవింద సమేత’ మ్యానియా క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ జరపకుండా డైరెక్ట్ గా పాటలు విడుదల చేస్తున్న నేపధ్యంలో ఈ ‘పెనివిటి’ సాంగ్ సృష్టించే మ్యానియా గురించి జూనియర్ అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు..    



మరింత సమాచారం తెలుసుకోండి: