ప్రిన్స్ మహేష్ బాబు 43 సంవత్సరాల వయసు దాటిపోయినా ఇంకా విపరీతమైన గ్లామర్ తో యంగ్ హీరోగా మెరిసిపోతూ ఉండటం హీరోలు అందరికీ అంతుచిక్కని సీక్రెట్. తన గ్లామర్ రహస్యం గురించి చెప్పమంటే తాను ప్రశాంతంగా ఉండటమే తన గ్లామర్ సీక్రెట్ అంటూ మహేష్ అనేక ఇంటర్వ్యూలలో ఓపెన్ గానే చెప్పాడు. 
Maharshi Teaser
ఇలాంటి పరిస్థుతులలో మహేష్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘మహర్షి’ సినిమాకు సంబంధించి షూటింగ్ స్పాట్ నుండి లీక్ అయిన ఒక ఫోటోను చూసి కొందరు మహేష్ కు ‘ఊసరవిల్లి’ లక్షణాలు వస్తున్నాయా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మహేష్ ఇప్పటి వరకు నటించిన సినిమాలు కేవలం 24 మాత్రమే అయినా ఆ సినిమాలలో హిట్స్ తో సమానంగా ఫ్లాప్ లు ఉన్నా రోజురోజుకు పెరిగిపోతున్న మహేష్ మ్యానియా ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మారింది. 
A still from Maharshi teaser, featuring Mahesh Babu. YouTube screengrab
వంశీ పైడపల్లి దర్శకత్వంలో 25వ సినిమాగా సెట్స్ పై ఉన్న మహేష్  ‘మహర్షి’ మూవీకి సంబంధించి లేటెస్టుగా మరో ఫోటో ఆన్ లైన్ లో లీకైంది. ఈ లుక్ రియల్లీ ఫెంటాస్టిక్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బ్లూ లెదర్ జాకెట్ ఇన్ సైడ్ బ్లాక్ కాంబినేషన్ నెక్ టీస్ తో అల్ట్రా మోడ్రన్ గా కనిపిస్తున్న మహేష్ లుక్ ను చూసి అవసరాన్ని బట్టి తన రూపం మార్చుకునే ఊసరవెల్లితో మహేష్ ను పోలుస్తున్నారు. 

‘1 నేనొక్కడినే’ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపించిన మహేష్ ‘శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’ సినిమాలలో కార్పోరేట్ ధనవంతుడుగా కనిపించి ఇప్పుడు దర్శకుడు వంశీ పైడిపల్లి కాలేజీ స్టూడెంట్ గా మారిపోమని అడగగానే సన్నని గడ్డం నూనూగు మీసంతో మరో కొత్త లుక్ తో కనిపిస్తున్న మహేష్ ను చూసి సూపర్ స్టార్ ఊసరవెల్లిలా మారిపోతున్నాడు అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీని వచ్చే ఏడాది ఉగాది పండుగ రోజున విడుదల చేయబోతున్నారు. మరి ఈ టాలీవుడ్ ఊసరవెల్లి బాలీవుడ్ ఊసరవెల్లిగా ఎప్పుడు మారుతుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: