ప్రపంచంలో టెక్నాలజీ రంగంలో దూసుకు పోతుంది..ప్రతి మనిషి ఆధునిక పోకడలకు పోతున్నారు.  దేశంలో అభివృద్ది అత్యంత వేగంగా ముందుకు సాగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  తాజాగా ప్రణయ్ హత్య పై హీరో రాంచరణ్ స్పందించి మాట్లాడారు.   

అడా, మగా అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో యువత ముందుకు సాగుతుంది..ఇలాంటి సమయంలో కూడా ఇంకా కులాలు, మతాలు అంటూ కొట్టుకోవడం నిజంగా మన దౌర్భాగ్యం..మొన్న మిర్యాలగూడలో కులంపేరుతో హత్య జరిగిందని వార్త విన్నప్పటి నుంచి ఇలాంటి హత్యలపై అసహ్యమేస్తోందని చెప్పాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువుహత్యలో ప్రణయ్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

తన కూతురు  గర్భవతి అని తెలిసి కూడా ఇంత క్రూరమైన ఆలోచన ఎలా వచ్చింది. క మనిషిని ఇంత దారుణంగా చంపడం పరువుహత్య అవుతుందా? అని ప్రశ్నించాడు. ఈ సమాజం ఎటు వెళ్తోందని అన్నాడు. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించాడు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: