తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల గత సంవత్సరం ‘ఫిదా’చిత్రంతో తెలుగు రాష్ట్ర ప్రజలను నిజంగానే ఫిదా చేశాడు.  ఈ చిత్రంలో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్..మళియాళి భామ సాయి పల్లవి నటించారు. ఇక సాయి పల్లవి నటించిన పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..సాయి పల్లవి తెలంగాణ యాసతో అందరినీ ఆకట్టుకుంది.  అమెరికాలో పెరిగిన అబ్బాయిగా వరుణ్ తేజ్ .. తెలంగాణ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిగా సాయిపల్లవి ఈ సినిమాలో నటించారు.   

చిన్ని చిత్రంగా రిలీజ్ అయినా..భారీ కలెక్షన్లు రాబట్టింది..ఓవర్సీస్ లో కూడా ఫిదా దుమ్మురేపింది. ఈ సినిమాలో "వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెటు యేసిండే గమ్మున కూసో నియ్యాడే .. కుదురుగా నిల్సోనియాడే" అనే పాట ఎంత క్రేజ్ వచ్చిందో అందిరికీ తెలిసిందే.  తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఫంక్షన్లు జరిగినా..కార్యక్రమాలు జరిగినా ఈ పాట ఖచ్చితంగా వాడేస్తున్నారు. 

యూట్యూబ్ లో ఈ పాటను ఇంతవరకూ 150 మిలియన్ల (15 కోట్లు) మందికి పైగా వీక్షించారంటూ, ఫేస్ బుక్ ద్వారా శేఖర్ కమ్ముల ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాజాగా 150 మిలియన్ మార్క్ ను దాటిన తొలి తెలుగు పాట ఇదే .. అద్భుతమైన మీ స్పందనకు ధన్యవాదాలు .. ఈ మ్యాజిక్ లో భాగమైన 'ఫిదా' టీమ్ కి శుభాకాంక్షలు' అని ఆయన పోస్ట్ చేశారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: