ఈ మద్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొంత మంది నటులు తర్వాత వేరు వేరు విభాగాల్లోకి వెళ్లిపోతున్నారు.  మారుతి దర్శకత్వంలో సుధీర్ బాబు నటించిన ‘ప్రేమ కథా చిత్రమ్’లో దెయ్యాన్ని..అక్కా అంటూ సంబోధిస్తూ కడుపుబ్బా నవ్వించిన సప్తగిరి తర్వాత పలు చిత్రాల్లో తనదైన కామెడీ పండించాడు.  పరుగు చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన సప్తగిరి ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’మంచి పేరు తెచ్చుకున్నాడు. దాంతో మనోడియి వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  వాటిల్లో కొన్ని హిట్ అయ్యాయి, ఫలితంగా సప్తగిరికి హీరో ఛాన్సులు కూడా వచ్చాయి. 

కమెడియన్లు హీరోలుగా మారిన సందర్బాలు చాలా ఉన్నాయి. గతంలో రాజబాబు, పద్మనాభం, చలం లాంటి వారు అయితే..తర్వాత కాలంలో బ్రహ్మానందం, ఆలీ, సునీల్ లాంటి వారు హీరోలుగా నటించారు.  ప్రస్తుతం కమెడియన్ల నుంచి హీరోలుగా మారిన వారిలో సప్తగిరి,శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ లు ఉన్నారు.  హీరోగా  సప్తగిరి కూడా రెండు మూడు ప్రయత్నాలు చేశాడు.

అయితే అవన్నీ బెడిసి కొట్టాయి. కమేడియన్ నుంచి మాస్ హీరో అయిపోదామనుకున్న ఇతడి ప్రయత్నాలకు భంగపాటు తప్పలేదు.  దాంతో ఇక లాభం లేదనుకొని సప్తగిరి దర్శకత్వం మీద కన్నేశాడని వార్తలు వస్తున్నాయి. దర్శకుడిగా మారి ఓ చిత్రాన్ని రూపొందించాలనే ప్రయత్నంలో ఉన్నాడట సప్తగిరి.  వాస్తవానికి ఇండస్ట్రీలో అసిస్టెండ్ టైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సప్తగిరి అనుకోకుండా నటుడిగా మారాడు.  ఇప్పుడు మళ్లీ దర్శకత్వంపై దృష్టిమళ్లినట్టుందని అంటున్నారు సన్నిహితులు. మరి సప్తగిరి దర్శకత్వ విభాగంలో సత్తా చాటతాడేమో చూడాలి! 


మరింత సమాచారం తెలుసుకోండి: