తెలుగు రాష్ట్రాల యూత్ కు ఐకాన్ గా మారిపోయి క్రేజీ సెలెబ్రెటీ స్థాయిని అందుకున్న విజయ్ దేవరకొండ మ్యానియా గురించి కొత్తగా ఎవరికీ పరిచయం చేయవలసిన అవసరం లేదు. తాను నటించే సినిమాల విషయంలోనే కాకుండా తన ప్రవర్తన విషయంలో కూడ రొటీన్ కు భిన్నంగా ఉండే విజయ్ దేవరకొండకు సంబంధించిన ఏన్యూస్ లీక్ అయినా అది మీడియాకు హాట్ టాపిక్.
ఇలాంటి పరిస్థుతులలో విజయ్ ఒక ఫారిన్ అమ్మాయితో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నాడని గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ వార్తలకు సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు దొరకక పోవడంతో కేవలం ఆవార్తలు గాసిప్పులుగానే మిగిలి పోయాయి.
‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్తర్ హిట్ తరువాత తన గర్ల్ ఫ్రెండ్ కలుసుకోవడానికి విదేశాలకు వెళ్ళినట్లు లీకుకులు వచ్చాయి. ఇప్పుడు ఈవార్తలకు కొనసాగింపుగా విజయ్ దేవరకొండ ప్రేయసి ఫోటోలు బయటపడటంతో ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలుస్తున్న సమాచారం మేరకు విజయ్ ప్రేమసి పేరు ‘విర్గినీ’ అని తెలుస్తోంది. ఈమె బెల్జియం దేసస్తురాలనీ చాలాకాలంగా ఈమె విజయ్ దేవరకొండతో సాన్నిహిత్యంగా ఉండటమే కాకుండా విజయ్ కుటుంబ సభ్యులతో ఆమె సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఈఫోతోలు లీక్ అయినట్లు సమాచారం. ‘పెళ్లి చూపులు’ సినిమాలో ఒక సీన్ లో ఈమె కనిపించినట్లు కూడా చాలండి గుర్తిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన వీరిద్దరి ప్రేమ మరి కొంతకాలం కొనసాగి పెళ్ళి వరకు కొనసాగుతుందో లేదో చూడాలి..