రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఈరోస్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు హోల్‌ సేల్‌ గా తెలుగు సినిమా హక్కులను కొని రిలీజ్  చేయడం కొత్త కాకపోయినా ఇలా బాలీవుడ్ కార్పొరేట్ సినిమా కంపెనీలు కొన్న చాలా తెలుగు సినిమాలు ఫెయిల్ అయిన సెంటిమెంట్ ఉంది. ‘అత్తారింటికి దారేది’ మినహాయిస్తే రిలయన్స్ వాళ్లు రిలీజ్ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లే. ఇక ఈరోస్ సంస్థ అయితే ‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ లాంటి సినిమాల దెబ్బకు బెంబేలెత్తిపోయిన విషయాలు తెలిసినవే. 
devadas movie first single song vaaru veeru released
ఈరోస్ సంస్థ మళ్లీ ‘సాక్ష్యం’ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రి ఇచ్చినా ఆ సినిమా ఫలితం వల్ల ఈరోస్ కు బాగా నష్టాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో మరో  బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఒక తెలుగు సినిమాను హోల్‌ సేల్‌ గా కొనేయడం హాట్ టాపిక్ గా మారింది. నాగార్జున నానీల మల్టీ స్టారర్ ‘దేవదాస్’ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 భారీ మొత్తానికి వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ ను తీసుకోవడంతో ఈసినిమాలో అంత విషయం ఉందా అన్న కొత్త చర్చలకు తెర తీసింది. 
దేవదాస్ కు 'సో మెనీ కుక్స్'
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు చాలామంది ప్రముఖ రచయితలు పనిచేయడం చాలామందికి అర్ధం కాని విషయంగా మారింది. మూల కథను రాఘవ శ్రీరామ్ ఇస్తే భూపతి రాజా ఆకథను సినిమా కథగా మార్చినట్లు టాక్.  ఆ తరువాత ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో సత్యానంద్ జాయిన్ అయ్యాడు. వీళ్లంతా చాలదన్నట్లుగా సినిమా సీన్స్ విషయంలో ఎమోషనల్ సీన్స్  వ్రాయడంలో మంచి పేరు ఉన్న బుర్రా సాయిమాధవ్ ను రంగంలోకి దింపి కొన్ని సీన్స్ కు డైలాగులు వ్రాయించడంతో ఇంతమంది కలిసి తయారు చేసిన దేవదాస్ స్క్రిప్ట్ కలగూరగంపగా మారుతుందా అంటూ మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నరు. 
devadas teaser
రేపు అక్కినేని నాగేశ్వర రావు 95వ జయంతి సందర్భంగా జరగబోతున్న ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తరువాత ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో ప్రమోట్ చేయాలి అని నిర్మాత అశ్వినీ దత్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘మహానటి’ మూవీతో తిరిగి అదృష్టం బాట పట్టిన అశ్వినీ దత్ కు ‘దేవదాస్’ విజయం కూడ తోడైతే ఈ నిర్మాత తన సినిమాల నిర్మాణ విషయంలో టాప్ గేర్ లోకి వెళ్ళి పోయినట్లే అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: