ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షో భారత దేశంలో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది.  బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ పదకొండ సీజన్లు పూర్తి చేసుకొని పన్నెండో సీజన్ మొదలైంది.  తెలుగులో ప్రస్తుతం బిగ్ బాస్ కి నాని హెస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  తమిళంలో కమల్ హాసన్, కన్నడంలో కిచ్యచా సుదీప్, మళియాళంలో మోహన్ లాల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు.  ఈనెల 16న హిందీ బిగ్‌బాస్ సీజన్ 12... సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వైభవంగా ప్రారంభమైంది. 

హిందీ బిగ్ బాస్ లో హౌస్‌మేట్స్‌కు ఓ టాస్క్ ఇవ్వగా..ఆ టాస్క్ ని పూర్తి చేయలేదట క్రికెటర్ శ్రీశాంత్.  దాందో ఇంటి సభ్యుల మద్య వివాదం నెలకొందట. దీంతో క్రికెటర్ శ్రీశాంత్... బిగ్‌బాస్‌ను వదిలి వెళ్లిపోతానని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. 12వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న శ్రీశాంత్‌కు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చారు.

అయితే ఆ టాస్క్ తనకు నచ్చకపోవడంతో శ్రీశాంత్ చేయనని చెప్పాడట..ఎవరూ ఎంత చెప్పినా టాస్క్ పూర్తి చేసేందుకు ఆయన ససేమిరా అన్నాడు. దాంతో బిగ్‌బాస్ టాస్క్‌ని రద్దు చేశారు. వెంటనే ఇంటి సభ్యులు శ్రీశాంత్ ని టార్గెట్ చేసుకోవడంతో..నొచ్చుకున్న శ్రీశాంత్.. హౌస్ నుంచి వెళ్లిపోతానని తెలిపారు. గేమ్‌లో టాస్క్‌లన్నీ ఇలాగే ఉంటాయంటే తను కంటిన్యూ చేయలేనని స్పష్టం చేశాడు. గతంలో తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 లో కమెడియన్ సంపూర్ణేష్ బాబు కూడా తనకు బిగ్ బాస్ లో ఉండాలని లేదని..ఇంటికి పోతానని పెద్ద గొడవ చేసిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: