తెలంగాణ లో సంచలనం రేపిన పరువు హత్య తెలుగు సమాజం సిగ్గు తో తల దించుకుంటుంది. మనం ఏ సమాజం లో ఉన్నామని ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ప్రశ్నించారు. అయితే `జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్` పేరుతో అమృత ఫేస్ బుక్, ట్విట‌ర్ లలో మొద‌లు పెట్టిన క్యాంపెయిన్ కు భారీ ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది. ఇప్ప‌టికే ఫేస్ బుక్ లో 85వేల‌కు పైగా లైక్ లు వ‌చ్చాయి. ట్విట‌ర్ లో జోరుగా ట్రెండింగ్ లో ఉంది. తాజాగా జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్ కు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌ద్దతు తెలిపాడు.

Image result for pranay amrutha

ప్ర‌ణ‌య్ హ‌త్య‌ను తీవ్రంగా ఖండిస్తూ త‌న సందేశాన్ని పంపించాడు. ఈ త‌ర‌హా ప‌రువు హ‌త్య‌లు ఎంతో క‌లిచివేస్తాయ‌ని పేర్కొన్నాడు. ఒక వ్య‌క్తి ప్రాణం తీయ‌డంలో ప‌రువు ఎక్క‌డుంద‌ని ప్ర‌శ్నించాడు. స‌మాజంలో సంఘ‌జీవుల‌మైన మ‌నం ఎటు పోతున్నామ‌ని..ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం అత్యంత బాధాక‌ర‌మైన‌వి అన్నాడు. ప్ర‌ణ‌య్ ఆత్మ‌కు శాంతి చేకూర‌ల‌ని కోరాడు. చ‌ర‌ణ్ స్పందిచాడు కాబ‌ట్టి ఆ పేజ్ ఫాలో వ‌ర్స్ కూడా పెరుగుతున్న‌ట్లు స‌మాచారం.

Image result for pranay amrutha

రామ్ చ‌ర‌ణ్ అభిమానులు కూడా ఘ‌ట‌న‌పై స్పందించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అదే గ‌నుక జ‌రిగితే జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్ ఫేస్ బుక్ పేజ్ మ‌రింత వెడెక్కుతుంది. ఇప్ప‌టికే టాలీవుడ్ హీరోలు రామ్, మ‌నోజ్ , గాయ‌ని చిన్మ‌యి ఘ‌ట‌న‌పై త‌మ‌దైన శైలిలో స్పందించారు. రామ్ అయితే హ‌త్య చేసిన వారిని…చేయించిన వారిని అడ‌విలో మృగాల‌తో పోల్చాడు. కులం పిచ్చోళ్ల‌ను మ‌నోజ్ అయితే చీల్చి చెండాడు. మ‌నుషుల్లా బ్ర‌త‌కండి..మృగాల్లా కాదంటూ ఆగ్ర‌హం చెందాడు. మ‌నుషుల్లా ఉండి కుల‌రహిత స‌మాజాన్ని భావిత‌రాలకు అందిద్దామ‌ని పిలుపునిచ్చాడు. అయితే ''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' మరో ఉద్యమం జరగాలని అందరూ పిలుపునిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: