తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోగా ‘లీడర్’చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు దగ్గుబాటి రానా.  ఆ తర్వాత వచ్చిన చిత్రాలు ఏవి మనోడికి పెద్దగా ప్లస్ కాలేదు..అయితే కేవలం తెలుగులోనే కాదు హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ తన సత్తా చాటుకుంటూ వచ్చాడు.  స్టార్ హీరో ఇమేజ్ కోసం పాకులాడకుండా..తనకు వచ్చిన ప్రతి ఆఫర్ ని వినియోగించుకుంటూ వచ్చాడు. తమిళ, కన్నడ భాషల్లో కూడా నటిస్తున్నాడు రానా. 

ఇక బాహబలి సీరీస్ తో ఏకంగా జాతీయ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా ఈ మద్య ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.  ఈ సందర్బంగా తాను ఒకటి చెబితే  వారు ఒకటి ప్రచురించారని..తాను మాట్లాడిన విషయం సరిగా వినిపించుకోక పోవడం వల్ల జరిగిన పొరపాటు అని అంటున్నాడు.  ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో ఈ విధంగా పోస్ట్ చేశాడు.

  'నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు సరిగా విన్నట్టు లేదు' అని వ్యాఖ్యానించాడు. అసలు విషయంలోకి వెళ్తే... 'నాకు బాలీవుడ్ లో ఏదీ ఆసక్తికరంగా లేదు' అని రానా అన్నట్టుగా సదరు పత్రిక ప్రచురించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: