దసరాను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘అరవింద సమేత’ పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్న నేపధ్యంలో ఈమూవీ విడుదల తరువాత త్రివిక్రమ్ చేయబోయే మూవీ గురించి కూడ ఊహాగానాలు అప్పుడే మొదలైపోయాయి. కొద్దిరోజుల క్రితం త్రివిక్రమ్ అల్లు అర్జున్ ల మధ్య ఒక కీలక సమావేశం జరిగిందని ఆసమావేసంలో త్రివిక్రమ్ బన్నీకి ఒక కథ చెప్పాడు అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. 
Trivikram Not Showing Interest To Direct Bunny
‘నాపేరు సూర్య’ ఘోర పరాజయం తరువాత ఏదర్శకుడుతో సినిమా చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న అల్లు అర్జున్ కు త్రివిక్రమ్ చెప్పిన కథ బాగా నచ్చింది అన్నవార్తలు కూడ ఉన్నాయి.  వాస్తానికి దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన సబ్జెక్ట్ కు సంబంధించి స్క్రిప్ట్ రెడీ అవుతున్న ఆ స్క్రిప్ట్ లో కాస్త ఎంటర్ టైన్ మెంట్ ఎలిమెంట్ తగ్గిందని అల్లు అర్జున్ భావిస్తున్న నేపధ్యంలో విక్రమ్ స్క్రిప్ట్ కు సాలిడ్ ఎంటర్ టైన్ మెంట్ ను జోడించేందుకు వక్కంతం వంశీని విక్రమ్ కు సహాయంగా రంగంలోకి దింపారని కూడా వార్తలు వచ్చాయి. 
Allu Arjun, Vikram Kumar, Suriya, Sarrainodu, 24, Tollywood, Kollywood, Telugu Films, Tamil Films
ఈవార్తల మధ్య ఇప్పుడు త్రివిక్రమ్ బన్నీలు కలవడంతో అల్లు అర్జున్ తన వ్యూహాలు మార్చుకుని విక్రమ కుమార్ ను పక్కకు పెట్టి త్రివిక్రమ్ తో అడుగులు వేస్తాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే ఈవిషయం పై ఒక స్థిర నిర్ణయం తీసుకోవడానికి అల్లు అర్జున్ ‘అరవింద సమేత’ రిజల్ట్ గురించి వేచి చూస్తున్నట్లు సమాచారం.
Jr NTR in Aravinda Sametha
అనుకున్న విధంగా 'అరవింద సమేత' బ్లాక్ బస్టర్ హిట్ అయితే బన్నీ ఆలోచనలలో మార్పులు వచ్చి విక్రమ్ కుమార్ ప్రాజెక్ట్ వెనక్కు వెళ్ళి త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ముందుకు రావడం ఖాయం అని అంటున్నారు. అయితే ‘అరవింద సమేత’ కు ఎటువంటి డివైడ్ టాక్ రాకుండా ఆమూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా మారితే త్రివిక్రమ్ బన్నీల మూవీ వెంటనే పట్టాలు ఎక్కుతుందనీ లేకుంటే ముందుగా అనుకున్నట్లుగానే అల్లు అర్జున్ విక్రమ్ కుమార్ తో వెళతాడు అని అంటున్నారు. ఒకవిధంగా విక్రమ్ కుమార్ భవిష్యత్ ను తేల్చే సినిమాగా కూడ ‘అరవింద సమేత’ మారింది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: