ఆ ఇద్దరిదీ వెండితెర బంధమే కాదు, నిజ జీవితంలోనూ సోదర బంధమే. పోటా పోటీగా మూవీస్ చెస్తున్నా కూడా ఇద్దరి మధ్యనా అప్యాయత, అనురాగాలు చెక్కు చెదరలేదు. తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలుగా, రెండు కళ్ళుగా వెలిగారు. ఆ ఇద్దరూ ఇపుడు లేకపోయినా వారి తీపి గురుతులు మాత్రం పదిలంగానే ఉన్నాయి. 



విషయానికి వస్తే అన్న నందమూరి బయోపిక్ తీస్తున్న సంగతి విధితమే. ఇందులో అన్న గారి పాత్రలో ఆయన కుమారుడు బాలయ్య మెరిసిపోనున్నాడు. నందమూరి అంటే పక్కన అక్కినేని ఉండాల్సిందేగా. మరి ఆ పాత్రకు ఎవరు  సరిపోతారని ఆరా తీసినపుడు దర్శకుడు క్రిష్ మంచి చాయిస్ ఎంచుకున్నారు. అక్కినేని మనవడు సుమంత్ అచ్చం తాత గారి పోలికలను పుణికి పుచ్చుకున్నాడు. దాంతో ఆయంతొ ఆ పాత్రకు జీవం పోస్తున్నారు.



ఈ రోజు అక్కినేని జయంతి సందర్భంగా బయోపిక్ లో అక్కినేన్ని పాత్రధారి  సుమంత్ ఫొటోను విడుదల చేశారు. అక్కినేనికి నివాళిగా ఈ ఫొటో విడుదల చేయడం టైంలీగా ఉందని అంటున్నారు. ఇక ఏయన్నార్ గా సుమంత్ ఆ గెటప్ లో అదిరిపోయాడని ప్రశంసలు వస్తున్నాయి. మొత్తానికి బయోపిక్ అంచనాలు పెంచే రేంజిలో ఉండడంతో ఇంటెరెస్ట్ బాగా పెరిగిపోతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: