నాగ చైతన్య హీరోగా మారుతి డైరక్షన్ లో వచ్చిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. రమ్యకృష్ణ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న రిలీజ్ అయ్యింది.


మొదటి షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకున్నా సరే కలక్షన్స్ లో చైతన్య జోష్ కనబరిచాడు. మొదటి రోజు 7.50 కోట్ల షేర్ తో తన కెరియర్ లోనే హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా వీకెండ్ వరకు బాగానే ఉన్నా సోమవారం నుండి అసలు టెస్ట్ మొదలైంది. ఇక వారం మొత్తంలో ఈ సినిమా 16.14 కోట్ల వసూళ్లను రాబట్టింది.


24.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా ఇప్పటివరకు 65 శాతం దాకా రిటర్న్ రాబట్టింది. ఫుల్ రన్ లో 20 కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చు. టాక్ ఎలా ఉన్నా ఈ రేంజ్ లో వసూళ్లను రాబట్టడం గొప్ప విషయమే. నాగ చైతన్య సవ్యసాచి సినిమాకు ఈ సినిమా మంచి బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది.  


ఏరియాల వారిగా శైలజా రెడ్డి వారం రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..


నైజాం : 3.90 కోట్లు 
సీడెడ్ : 2.45 కోట్లు 
ఉత్తరాంధ్ర : 1.53 కోట్లు 
గుంటూర్ : 1.23 కోట్లు 
ఈస్ట్ : 1.38 కోట్లు 
వెస్ట్ : 0.86 కోట్లు 
కృష్ణా : 0.93 కోట్లు 
నెల్లూరు : 0.56 కోట్లు 
ఏపి/ టెలంగాణా : 12.84
రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.75 కోట్లు 
ఓవర్సీస్ : 1.55 కోట్లు 
వరల్డ్ వైడ్ టోటల్ కలక్షన్స్ : 16.14 కోట్లు  


మరింత సమాచారం తెలుసుకోండి: