తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రెండు కళ్ళుగా కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని శాసించిన ఎన్టీఆర్ అక్కినేనిలు భౌతికంగా ప్రస్తుతం జీవించి ఉండకపోయినా వారి వారసుల హవా కొనసాగుతున్న నేపధ్యంలో ఇప్పటికీ అక్కినేని ఎన్టీఆర్ ల జ్ఞాపకాలు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని వెంటాడుతూనే ఉన్నాయి. కేవలం సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా వ్యాపార పరంగా సామాజికంగా అక్కినేని నందమూరి కుటుంబాలు ప్రస్తుతం ఒక మహా వృక్షాలుగా ఎదిగిపోయిన నేపధ్యంలో అక్కినేని ఎన్టీఆర్ ల జీవితాలకు సంబంధించి ఇంకా ఎన్నో విషయాలు చర్విత చరణంగా నేటి తరానికి గుర్తుకు చేస్తూనే ఉన్నారు.
ANR-Akkineni-Nageshwara-Rao-1
ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తున్న నేపధ్యంలో ఈరోజు అక్కినేని నాగేశ్వరావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేని గెటప్ ను విడుదల చేసారు. సుమంత్ చిన్నప్పటి నుండి అక్కినేని వద్ద పెరగడంతో అక్కినేని లుక్ లో అక్కినేని నవ్వును అదేవిధంగా అక్కినేని కళ్ళల్లో ఉండే చిలిపి తనాన్ని సుమంత్ తన లుక్ తో యధాతధంగా దించేసాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
NBK-Akkineni
ముఖ్యంగా మధ్యవయస్సు వచ్చిన తరువాత అక్కినేని ఎలా వుండేవారో అదే లుక్ తో సుమంత్ లుక్ కనిపిస్తూ ఉండటంతో పాటు అక్కినేని ట్రేడ్ మార్క్ కళ్లజోడు అక్కినేని లాల్చీతో సుమంత్ బాగానే సెట్ అయ్యాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా ఈరోజు సాయంత్రం ఈసినిమాకు సంబంధించి ఎన్టీఆర్ - ఎఎన్నార్ కలిసి ఉన్న స్టిల్ విడుదల చేయబోతున్నారు. 
Krish Director Images 6
ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ ఎఎన్ఆర్ పాత్రలో నటిస్తున్న సుమంత్ లను ఒకే ఫ్రేమ్ లోకి తీసుకు వచ్చి షూట్ చేసిన ఒక సన్నివేశానికి సంబంధించిన స్టిల్ అది అని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ నాగార్జునల మధ్య చెప్పుకోతగ్గ సాన్నిహిత్యం లేకపోయినా అలనాటి ఎన్టీఆర్ ఎఎన్ఆర్ ల సాన్నిహిత్యాన్ని గుర్తుకు చేస్తూ క్రిష్ విడుదల చేయబోతున్న ఈస్టిల్ ఖచ్చితంగా అక్కినేని నందమూరి ఫ్యాన్స్ కు కనెక్ట్ అయి తీరుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: