తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత గొప్ప క్రేజ్ సంపాదించిన హీరో విజయ్.  తమిళ అభిమానులు విజయ్ ని ఇళయదళపతి అంటారు.  విజయ్ తాజా చిత్రంగా మురుగదాస్ దర్శకత్వంలో 'సర్కార్' చిత్రం రూపొందుతోంది. విజయ్ కి ఇది 62 వ చిత్రం. మురుగదాస్ దర్శకత్వం లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథ తో ఈ చిత్రం రూపొందించబడుతుంది. ఈ చిత్రానికి సంబంధించిని పోస్టర్లకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది.

ఈ నేపథ్యంలో ఫస్టు సింగిల్ కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  అక్టోబర్ 2 వ తేదీన ఆడియో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  భారీ ఎత్తున ఆడియో వేడుకను నిర్వహించేందుకు సన్ పిక్చర్స్ సన్నాహాలు చేస్తున్నది. ఈ ఆడియో రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధి గా సూపర్ స్టార్ రజినీకాంత్ అటెండ్ అవ్వబోతున్నట్లు సమాచారం.

కాగా , ఈ చిత్రాన్ని  దీపావళి పండుగ కు రిలీజ్ చేయ్యలని ప్లాన్ చేసారు చిత్ర యూనిట్. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు.  ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేశ్ నటించగా .. మరో ముఖ్యమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: